గత ఏడాది ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలు కానేలేదు. అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
యువి క్రియేషన్స్ బ్యానర్ లో అదే సంస్థలో పని చేసిన అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ గ్రాండియర్ ని ప్లాన్ చేశారు. దీని కోసమే ప్రత్యేకంగా జుత్తు, గెడ్డం విపరీతంగా పెంచేసిన అఖిల్ ఈసారి ఎలాగైనా సరే గురి తప్పకూడదనే సంకల్పంతో ఎంత ఆలస్యమవుతున్నా సరే ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ దీనికి మహేష్ బాబుకి కనెక్షన్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం.
ఈ ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీలో అఖిల్ పదకొండో శతాబ్దానికి చెందిన ఒక అటవీ వీరుడిగా కనిపిస్తాడని సమాచారం. అంటే మొత్తం అడవి బ్యాక్ డ్రాపన్నమాట. అపకలిప్టో తరహాలో మొత్తం వేరే ప్రపంచంలో కథ సాగుతుందని తెలిసింది.
గతం వర్తమానాన్ని ముడిపెడుతూ టైం ట్రావెల్ లాంటివి లేకుండా కేవలం అప్పటి ఒక వీరుడి గాథని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తారట. ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు బోలెడు ఉంటాయి. రాజమౌళి ప్లాన్ చేసుకున్న మహేష్ బాబు 29లోనూ అటవీ నేపధ్యమున్న సంగతి తెలిసిందే. ఇండియానా జోన్స్ తరహాలో క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు.
అంటే రెండు సినిమాల్లోనూ కనిపించే సారూప్యత ఆడవన్న మాట. అయితే మహేష్ కన్నా ముందు అఖిల్ డీప్ ఫారెస్ట్ లోకి అడుగు పెట్టేలా ఉన్నాడు. సెట్స్ లో కాకుండా నిజమైన వాతావరణంలో తీసేందుకు అనిల్ కుమార్ రెడీ అవుతున్నట్టు తెలిసింది.
షూటింగ్ మొదలుపెట్టడంలో కొంత ఆలస్యం జరిగినా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా యువి మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. వీళ్ళ నిర్మాణంలోనే రూపొందుతున్న విశ్వంభర ఆగస్ట్ కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోనుండటంతో పూర్తి ఫోకస్ అఖిల్ 6 మీద పెట్టబోతున్నారు. హీరోయిన్, సాంకేతిక వర్గం తదితర వివరాలు త్వరలో తెలియనున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 9:34 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…