ఆగస్టు 15 అంటే ఎంతో ఆకర్షణీయమైన డేట్. ప్రతి ఏడాది ఆ వీకెండ్లో భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఈసారి పుష్ప-2 లాంటి క్రేజీ మూవీ ఆ తేదీకి షెడ్యూల్ కావడంతో భారతీయ సినీ ప్రియులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో ఆ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉండడంతో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వసూళ్ల మోత మోగిపోతుందని భావించారు. కానీ పుష్ప-2 అనూహ్యంగా ఆ డేట్ నుంచి తప్పుకుని డిసెంబరుకు వెళ్లిపోయింది.
మరి ఆగస్టు 15ను ఏ భారీ చిత్రం క్యాష్ చేసుకోవడానికి చూస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా.. ఇప్పటిదాకా అయితే ఏ పెద్ద సినిమా ఆ డేట్‌ను వాడుకునే ప్రయత్నం చేయలేదు. తెలుగు నుంచి రామ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ మాత్రమే ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది.
ఐతే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన భారతీయుడు-2కు ఆగస్టు 15 డేట్ తీసుకుంటే బాగా కలిసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియన్-2 టీం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అన్నీ పరిశీలించాక ఇండియన్-2 టీం ఆగస్టు 15 రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గింది. ఇంతకుముందు ప్రకటించినట్లే జులై 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం ఈ నెల 21న యుఎస్ ప్రిమియర్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా ధ్రువీకరించింది.
అంటే ఇండియన్-2 మరోసారి వాయిదా పడట్లేదని అర్థం. జూన్ 12కు అనుకున్న ఈ చిత్రాన్ని నెల రోజులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇంకోసారి వాయిదా వేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోతుందని.. ఈ చిత్రం ఆలస్యం అయ్యే కొద్దీ గేమ్ చేంజర్ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని భావించి అనుకున్న ప్రకారమే జులై 12న భారతీయుడు-2ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on June 20, 2024 10:57 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…