Movie News

వింటేజ్ డార్లింగ్ గుర్తుకు వచ్చాడుగా

ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్స్ మీద సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ కనిపిస్తూ వచ్చాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసేందుకు వెనుకాడలేదు. సలార్ లో డబ్బింగ్ మీద కొన్ని విమర్శలు వినిపించాయి. కానీ నిన్న జరిగిన కల్కి 2898 ఏడి ఈవెంట్ లో ప్రభాస్ లో ప్రత్యక్షంగా, లైవ్ ద్వారా చూసిన వాళ్లకు చాలా అనుమానాలు తీరిపోయాయి. ముఖ్యంగా ఒకప్పటి వింటేజ్ డార్లింగ్ ని గుర్తు చేసేలా మొహంలో పెరిగిన వర్చస్సు, తగ్గించుకున్న బరువు, మొహమాటంతో కూడిన ఒక అందమైన నవ్వుని అలా కొనసాగించడం ఇలా తనను ఇష్టపడే వాళ్ళు అలా చూస్తూనే ఉండాలనిపించేలా కనిపించాడు.

అమితాబ్, కమల్, దీపికాల గురించి చెబుతూ వినయంగా అన్న మాటలు, రానాతో చనువుగా స్టేజి మీద చూపించిన స్నేహం బాగా పేలాయి. రిలీజ్ డేట్ ఇంకో వారం రోజుల్లో ఉండటంతో బజ్ పరంగా ఉన్న అనుమానాలు దాదాపు తీరినట్టే అనుకోవాలి. దర్శకుడు నాగఅశ్విన్ మాత్రం ఓవర్ పబ్లిసిటీకి దూరం అంటున్నాడు. జూన్ 27 సినిమానే మాట్లాడాలనే స్థిరత్వం తనలో కనిపిస్తోంది. ఇండియా వైడ్ బాక్సాఫీస్ ఎదురు చూస్తున్న ప్యాన్ ఇండియా మూవీగా కల్కి మీద మాములు అంచనాలు లేవు. రాజమౌళి రికార్డులను తుడిచిపెట్టే డైరెక్టర్ గా నాగ అశ్విన్ మీద మూవీ లవర్స్ నమ్మకం అంతా ఇంతా కాదు.

హను రాఘవపూడితో చేయబోయే పీరియాడిక్ డ్రామా కోసం లుక్స్ మార్చుకుంటున్న ప్రభాస్ దీన్నే మారుతీ ది రాజా సాబ్ కోసం వాడుకోబోతున్నాడు. సాహు, రాధే శ్యామ్ వరుస డిజాస్టర్ల తర్వాత సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కొంత ఊరటనిచ్చినా అది ఫుల్ మీల్స్ కాలేకపోయింది. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ కల్కి 2898 ఏడి మీదే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఓవర్ సీస్ లోనూ భారీ రిలీజ్ దక్కించుకోబోతున్న ఈ విజువల్ వండర్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు నమోదు చేస్తోంది. ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ వస్తే చాలు ఆకాశమే హద్దుగా కల్కి చెలరేగిపోవడం ఖాయం.

This post was last modified on June 20, 2024 10:50 am

Share

Recent Posts

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

9 minutes ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

1 hour ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

4 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

7 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

7 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

9 hours ago