ఓవైపు క్యారెక్టర్, విలన్ రోల్స్ చేస్తూనే.. అప్పుడప్పుడూ హీరోగా కూడా పలకరిస్తుంటాడు టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర. అతను హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం.. లెవెన్. ఈ పేరుతో ఎప్పుడో సినిమా మొదలైనప్పటికీ నిన్నటిదాకా దీని గురించి ఎవరికీ తెలియదు.
సైలెంటుగా సినిమా పూర్తి చేసి నేరుగా టీజర్‌తో ప్రేక్షకులను పలకరించింది టీం. ఈ సినిమా టైటిల్ వినగానే జనాలకు వేరే అంశం గుర్తుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లే గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ నంబర్ మీద ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. గడియారంలో 11వ నంబర్ దగ్గర జగన్ ఫొటో పెట్టి కూడా ట్రోల్ చేస్తున్నారు టీడీపీ, జనసేన వాళ్లు.
ఇప్పుడు సినిమా టైటిల్ లెవన్ అని పెట్టడంతో వైసీపీ కౌంటర్‌గానే ఈ పేరు పెట్టారేమో అని కూడా జనాలు అనుకుంటున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్లో విలేకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 11 నంబర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది కాబట్టే ఈ సినిమాకు ఈ పేరు పెట్టారా అని అడిగితే.. టీం సభ్యులు నవ్వేశారు.
తమ చిత్రం ఎప్పుడో మొదలైందని, టైటిల్ కూడా ఎప్పుడో పెట్టారని.. దీని గురించి తాము ఏమీ స్పందించలేమని అన్నాడు నవీన్ చంద్ర. ఇదిలా ఉంటే.. లోకేష్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన లెవెన్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ లాగే కనిపిస్తోంది.
చాలా క్రూరంగా హత్యలు చేసే ఒక కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే పోరాటం నేపథ్యంలో నడిచే సినిమా ఇది. టీజర్ ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగి సినిమా మీద అంచనాలు పెంచింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 19, 2024 10:10 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…