‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అతను అప్పగికే ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా అది వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. రెండో సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేశాడు కార్తికేయ. కానీ ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతేనేం అతడికి అవకాశాలకేమీ లోటు లేదు.
గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేస్తున్న అతను.. తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘వాలిమై’లోనూ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అవి కాక సోమవారం కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దాని పేరు వెల్లడించలేదు కానీ.. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో జనాల దృష్టిని ఆకర్షించారు.
కార్తికేయ ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఒక కేసు తాలూకు ఫైల్‌లో వివరాలు నమోదు చేసినట్లుగా.. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి పోస్టర్లో వెల్లడించారు. ‘మిషన్ టైటిల్’ అన్న చోట ఖాళీ ఉంచడం ద్వారా ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదని చెప్పారు.
అలాగే కేస్ ఆఫీసర్ అనే చోట ఖాళీ ఉంచడం ద్వారా హీరో పాత్ర ఇప్పుడే వెల్లడించబోమని సంకేతాలిచ్చారు. మరో పేరు కార్తికేయ గుమ్మకుండ అని, అతడి పుట్టిన రోజు 21 సెప్టెంబరు అని వెల్లడించారు. ఆఫీసర్స్ ఆన్ ఫైల్ అని కింద నిర్మాత రామారెడ్డి, దర్శకుడు శ్రీ సరిపల్లిల పేర్లు వేశారు. ‘స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్’ అని ట్యాగ్ కూడా వేసి ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని చెప్పకనే చెప్పారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం సమకూర్చనున్నాడు. దీంతో పాటుగా ఈ రోజు రిలీజైన ‘చావు కబురు చల్లగా’ టీజర్ కూడా సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
This post was last modified on September 21, 2020 5:16 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…