Movie News

అల్లు అరవింద్‌కు అట్లీ షాక్

‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమా ఏదనే విషయంలో ఎంతకీ ఒక క్లారిటీ రావట్లేదు. వేణు శ్రీరామ్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, అట్లీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి గత కొన్నేళ్లలో. వేణు శ్రీరామ్‌తో అనుకున్న ‘ఐకాన్’ గురించి అధికారికంగా ప్రకటించారు కానీ తర్వాత దాని గురించి చర్చే లేదు. కొరటాల శివ సినిమా కూడా అనౌన్స్‌మెంట్ తర్వాాత అడ్రస్ లేకుండా పోయింది.

ఇక ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డిలతో చర్చలైతే జరిగాయి కానీ.. సినిమా లాక్ కాలేదు. చివరికి అట్లీ దర్శకత్వంలో నటించడానికి బన్నీ సూత్రప్రాయంగా అంగీకరించాడని.. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. సన్ పిక్చర్స్‌తో కలిసి అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

మరి అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమా ఎందుకు ముందుకు కదలట్లేదు అని సందేహం రావడం ఖాయం. బన్నీ కథ రెడీ అయ్యాక సంతృప్తి చెందక యుటర్న్ తీసుకోవడం మామూలే కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం దర్శకుడి పారితోషకం విషయంలో అభ్యంతరాలు తలెత్తి ఆగినట్లు తెలుస్తోంది. అట్లీ ఏకంగా రూ.80 కోట్ల పారితోషకం అడిగాడట ఈ చిత్రానికి. తమిళంలో అట్లీ తీసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లే. హిందీలోనూ గత ఏఢాది ‘జవాన్’ రూపంలో మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. అట్లీ సినిమాలు రొటీన్ అనిపించినా.. కమర్షియల్‌గా బాగా వర్కవుట్ అవుతాయి. అందుకే తనకు మాంచి డిమాండ్ ఉంది.

ఈ నేపథ్యంలోనే అతను రూ.80 కోట్లు పారితోషకం డిమాండ్ చేయగా.. దర్శకుడికే ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్టును వర్కవుట్ చేయడం కష్టమని అల్లు అరవింద్ వెనక్కి తగ్గారట. అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

This post was last modified on June 18, 2024 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

20 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago