Movie News

మంత్రి పవన్.. సినిమా ప్లాన్లేంటి?

పవన్ కళ్యాణ్ పేరు ముందు ఇప్పుడు ఎవ్వరూ పవర్ స్టార్ అని పెట్టట్లేదు. ఆరు నెలల పాటు అందరూ జనసేనాని అనే సంబోధించారు. ఇక రెండు వారాల కిందట ఆయన పేరు ముందు ఎమ్మెల్యే అని వచ్చి చేరింది. తాజాగా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయారు. కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి. దీంతో ఆయనపై ఎంత బాధ్యత పెరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పవన్‌ను ఇకపై ఎవ్వరూ పార్ట్ టైం పొలిటీషియన్ అనే పరిస్థితి లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనదైన ముద్ర వేయబోతున్న నాయకుడు అవుతారనడంలో సందేహం లేదు. ఐతే ఇప్పుడు పవన్‌కు ఓ సంకట పరిస్థితి ఏర్పడింది. ఆయన సినిమాలను పూర్తిగా విడిచిపెట్టే పరిస్థితి లేదు. కనీసం చేతిలో ఉన్న ప్రాజెక్టులైనా పూర్తి చేసి తీరాల్సిందే. అందుకోసం ఎంత టైం పెడతారు.. ఎప్పట్లోపు వాటిని పూర్తి చేస్తారు అన్నది ఆసక్తికరం.

పవన్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఆయన ఒకేసారి కాకుండా వచ్చే రెండేళ్లలో వీలున్నపుడల్లా డేట్లు కేటాయిస్తూ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. ముందు అనుకున్న ప్రకారం అయితే ‘ఓజీ’నే ముందు పూర్తి చేయాలి. కానీ తర్వాత ఆలోచన మారిపోయింది. ముందుగా ఆయన ‘హరిహర వీరమల్లు’ కోసం కాల్ షీట్స్ ఇస్తున్నారట. వచ్చే నెలలోనే షూట్ ఉండొచ్చని అంటున్నారు. దాన్ని పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తారట.

ఎన్నికల ముందు అయితే.. ఫలితాలు వచ్చాక ఒక ఆరు నెలలు టైం తీసుకుని వరుసబెట్టి సినిమాలన్నీ పూర్తి చేసేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్.. పైగా కీలక మంత్రిత్వ శాఖలను చేతిలో పెట్టుకుని ఆరు నెలలు వరుసగా గ్యాప్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడప్పుడు డేట్లు ఇచ్చి రాబోయే రెండేళ్లలో అన్ని సినిమాలనూ పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం హరిహర వీరమల్లు రెండో పార్ట్ చేయడం కూడా కష్టమే అంటున్నారు.

This post was last modified on June 17, 2024 7:13 pm

Share
Show comments

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

6 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

7 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

9 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

11 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

11 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

11 hours ago