టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్.. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మధ్య ఓ ఆసక్తికర పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆరేళ్ల వ్యవధిలో వీరి కెరీర్లలో వచ్చిన మార్పు చూసి సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. 2018లో తారక్ 28వ సినిమా అరవింద సమేత రిలీజైంది. ఇప్పుడు 2024లో తారక్ 30వ సినిమా అయిన ‘దేవర’ రాబోతోంది. ఈ ఆరేళ్ల వ్యవధిలో మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఏకైక రిలీజ్ ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే.
మరోవైపు విజయ్ సేతుపతి వ్యవహారం చూస్తే.. అతను 2018లో తన 25వ చిత్రం ‘సీతాకత్తి’ని రిలీజ్ చేశాడు. ఈ ఆరేళ్లలో శరవేగంగా సినిమాలు చేసిన సేతుపతి.. ఈ ఏడాది తన 50వ సినిమాతో పలకరించాడు. అదే.. మహారాజ. గత శుక్రవారమే ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైంది. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. సోలో హీరోగా సేతుపతికి చాన్నాళ్ల తర్వాత మంచి విజయాన్నందించిన చిత్రమిది.
సినిమా ఫలితాలను పక్కన పెడితే సేతుపతి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. విలన్, క్యారెక్టర్ రోల్స్ ఏవైనా చేసేస్తాడు. అందుకే ఏడాదికి ఐదారు సినిమాలకు తక్కువ కాకుండా రిలీజవుతుంటాయి. కాబట్టే ఆరేళ్ల వ్యవధిలో 25 సినిమాలు లాగించేశాడు. అతడికి, భారీ సినిమాలు చేసే తారక్‌కు పోలిక పెట్టడం కరెక్ట్ కాదు కానీ.. ఈ మధ్య తారక్ ఒక్కో సినిమాకు మరీ ఎక్కువ టైం తీసుకుంటున్నాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంటే రాజమౌళిది కాబట్టి ఆలస్యం కావడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ.. దేవర కోసం కూడా మూడేళ్లు టైం పెట్టడం వారికి రుచించడం లేదు. అందుకే సేతుపతి కెరీర్‌తో పోలిక పెట్టుకుని తారక్ పట్ల తమ అసహనాన్ని చూపిస్తున్నారు. ‘దేవర’ సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 17, 2024 8:14 am
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…
రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…
మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…
ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…