చాలా గ్యాప్ తరువాత సుధీర్ బాబు సినిమా డిజాస్టర్ కాదు పర్వాలేదనిపించుకున్న సినిమా హరోంహర. మరీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాకపోయినా ఉన్నంతలో ఒక మాస్ వర్గంతో ఓకే అనిపించుకునే కంటెంట్ అయితే ఉంది.
అయితే ఊహించని విధంగా తమిళ డబ్బింగ్ మహారాజ దీని వసూళ్లను ప్రభావితం చేయడం మాత్రం షాక్ కలిగించే విషయం. రిలీజ్ ముందు వరకు విజయ్ సేతుపతి మూవీ మీద అంతగా బజ్ లేదు. పదమూడో తేదీ రాత్రే ప్రీమియర్లు వేశాక సీన్ మారిపోయింది. ఉదయం ఆటలకు జనం అంతంత మాత్రంగా ఉన్నా సాయంత్రానికి సీన్ మొత్తం మారిపోయింది.
హరోంహర నెమ్మదించేయగా మహారాజా బాగా పికప్ అవుతున్నాడు. గత రెండు రోజుల్లో బుక్ మై షోలో తెలుగు తమిళ వెర్షన్లు కలిపి రెండు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం దానికి నిదర్శనం. ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో షేర్ బాగా వస్తోంది.
బిసి కేంద్రాల్లో కొంత స్లోగా ఉన్నప్పటికీ కౌంటర్ సేల్స్ బాగున్నాయని బయ్యర్ల రిపోర్ట్. ఎలాగూ సోమవారం బక్రీద్ సెలవు దినం కావడంతో వీకెండ్ మొత్తం నాలుగు రోజుల్లో లాభాల్లోకి అడుగు పెట్టడం ఖాయమని ట్రేడ్ టాక్. నైజం పంపిణి చేసిన మైత్రి మరోసారి జాక్ పాట్ కొట్టినట్టే కనిపిస్తోంది. సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యే దిశగా వెళ్తోంది.
ఒకవేళ మహారాజ లేకుండా కేవలం హరోంహర మాత్రమే వచ్చి ఉంటే సుధీర్ బాబు కొంత డామినేట్ చేసే అవకాశం దక్కేది. అలా అని వసూళ్లు మరీ బ్యాడ్ గా లేవు కానీ ఆశించిన స్థాయిలో వేగం లేదన్నది వాస్తవం. దర్శకుడు జ్ఞానసాగర్ మాస్ ఎలివేషన్లతో నింపేసిన వైనం అన్ని వర్గాలను పూర్తిగా మెప్పించలేకపోతోంది.
ఇంకొంచెం బెటర్ గా ఉండి ఉంటే ఖచ్చితంగా మహారాజ మీద ఆధిపత్యం చెలాయించేది. వీకెండ్ అయ్యాక హరోంహర ఫైనల్ స్టేటస్ ఏ విధంగా ఉండబోతోందనే దాని మీద స్పష్టత వస్తుంది. ఎలాగూ జూన్ 27 కల్కి దాకా పెద్దగా సినిమాల్లేవ్ కాబట్టి ఈ ఛాన్స్ వాడుకోవాలి.