ఒక పది రోజుల క్రితం వరకు మహారాజ పేరుతో విజయ్ సేతుపతి ఒక సినిమా చేశాడనే సంగతే తెలుగు ప్రేక్షకులకు తెలియదు. సోలో హీరోగా తన మార్కెట్ ఇక్కడ జీరో కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ సైతం మీడియాలో అంతగా హైలైట్ కాలేదు.
కట్ చేస్తే డబ్బింగ్ హక్కులు కొనేయడం, రెండు భాషల్లో సమాంతరంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగిపోయాయి. టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి ఆలస్యం చేయకుండా హైదరాబాద్ వచ్చి, మూడు నాలుగు రోజులు మకాం వేసి టీమ్ అడిగిన ప్రమోషన్స్ అన్నింటిలో భాగమై తన మీద దృష్టి పడేలా చేసుకున్నాడు.
అతని నమ్మకం నిజమయ్యింది. నిన్న విడుదలైన మహారాజకు ఆడియన్స్ మద్దతు దొరికింది. చాలా సీరియస్ కాన్సెప్ట్ అయినప్పటికీ దర్శకుడు నితిలన్ స్క్రీన్ ప్లేకి జనాలు ఫిదా అయ్యారు. పాజిటివ్ టాక్ క్రమంగా సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెవెల్ లో సాధారణ జనాలకు రీచ్ అవుతోంది.
నిన్న మార్నింగ్ షోలకు పలుచగా కనిపించిన పబ్లిక్ సాయంత్రానికి కౌంట్ పెంచేశారు. మెయిన్ థియేటర్లు దాదాపుగా ఫుల్స్ పడ్డాయి. శని ఆదివారాలు ఖచ్చితంగా భారీ ఫిగర్లు నమోదవుతాయనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. మాస్ ఆడియన్స్ సైతం మెల్లగా మొగ్గు చూపడం మొదలుపెట్టారు.
యాభై సినిమాగా విజయ్ సేతుపతికి ఇది కీలకం కావడంతో పబ్లిసిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడే ఇలా ఉంటే ఇక తమిళనాడులో చెప్పేదేముంది.
ఈ ఏడాది అతి పెద్ద హిట్స్ లో ఇది ఒకటిగా నిలవడం ఖాయమని చెబుతున్నారు. గత రెండు మూడు నెలలుగా కోలీవుడ్ లో సరైన హిట్ మూవీ పడలేదు. అందుకే గిల్లి, గజిని లాంటి పాత రీ రిలీజులనే జనం ఎగబడి చూశారు. ఇప్పుడు మహారాజ ఆ కొరత తీరుస్తుందని బయ్యర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కల్కి 2898 ఏడి వచ్చే దాకా రెండు వారాల గ్యాప్ ఉంది కాబట్టి అప్పటిరాజా మహారాజ సింహాసనం నిలబెట్టుకుంటే సరి.
This post was last modified on June 15, 2024 1:01 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల్లో ఏది ముందు రిలీజనే అయోమయం కొద్దిరోజులుగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిం దే. మంగళవారం ఢిల్లీకి…
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, మెస్మరైజింగ్ లుక్స్ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ నభా నటేష్. కన్నడ…
సాధారణంగా సినిమా నిడివి రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో ఉండటం ఎప్పటి నుంచో చూస్తున్నదే. ప్రేక్షకులు దీనికే అలవాటు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇది ఆయనకు అధికారం లోకి వచ్చిన తర్వాత…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సోదరుడు, పార్టీ కోసం కృషి చేస్తున్న నాగబాబు…