ఒక పెద్ద సినిమా వాయిదా పడుతుంటే.. అది చాలా ఆశ్చర్యకరమైన విషయంలా ఉండేది ఒకప్పుడు. కానీ కరోనా పుణ్యమా అని ఈ వాయిదాల పర్వం చాలా సాధారణమైన విషయంలా మారిపోయింది. ఒకసారి డేట్ ప్రకటించాక దానికి కట్టుబడి రిలీజయ్యే సినిమాలు అరుదైపోతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ ఆలస్యం అయింది అనుకుంటున్న పుష్ప-2 సినిమా ఆగస్టు 15కు రాకపోవచ్చన్న వార్త కొన్ని రోజుల నుంచి టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ వార్త రూమరనే అనుకున్నారు.
కానీ టీం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పుష్ప-2 వాయిదా పడడం పక్కా. సినిమా కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ డేట్‌ను దాటి కొన్ని రోజుల వరకు ఎక్స్‌టెండ్ చేశారన్నది తాజా సమాచారం. అంటే ఆగస్టు 15 నాటికి షూటింగ్ కూడా అవ్వదన్నమాట. షూటింగ్ స్టేటస్ అలా ఉన్నపుడు రిలీజ్ డేట్‌కు ఎలా కట్టుబడతారు?
పుష్ప-2 టీం సభ్యుల సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా నెలా రెండు నెలలకు పరిమితం కాదట. సినిమా నిడివితో పోలిస్తే రెట్టింపు రష్ ఉంటుందని.. దాన్ని ఎడిట్ చేయడం.. అన్ని భాషలకు కలిపి పోస్ట్ ప్రొడక్షన్ చేయడం.. సీజీ వర్క్ అంతా ఒక కొలిక్కి తేవడం.. ఈ వ్యవహారాలన్నీ చాలా టైం తీసుకునేవే. కాబట్టి ఆగస్టు 15 నుంచి ఇంకో ఐదు నెలలైనా పడుతుంది ఫస్ట్ కాపీ తీయడానికి. కాబట్టి ఆగస్టు మిస్ అయితే సెప్టెంబరు లేదా అక్టోబరు అనుకోవడానికి కూడా లేదు.
బహుశా పుష్ప-1ను రిలీజ్ చేసినట్లే పుష్ప-2ను డిసెంబరులో విడుదల చేయొచ్చన్నది చిత్ర వర్గాల అంచనా. అదే జరిగితే డిసెంబరులో రావాల్సిన చాలా సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకోక తప్పదు. పాన్ ఇండియా స్థాయిలో మార్పులు చేర్పులు అనివార్యం. దీని వల్ల ట్రేడ్ వర్గాల్లో ఒక అలజడి రేగడం ఖాయం.
This post was last modified on June 15, 2024 7:25 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…