చాన్నాళ్ల నుంచి టాలీవుడ్లో డ్రై రన్ నడుస్తోంది. వేసవిలో ఎన్నడూ చూడని స్లంప్ నడిచింది. కొన్ని వారాల పాటు చెప్పుకోదగ్గ సినిమాలే రిలీజ్ కాని పరిస్థితి కూడా తలెత్తింది. మే నెలాఖరు నుంచి కొన్ని క్రేజీ సినిమాల రాక మొదలైంది. కానీ ఆ వారం మంచి భజే వాయు వేగం మాత్రమే కొంత ప్రభావం చూపింది. మిగతా సినిమాలు నిరాశపరిచాయి.
గత వారం వచ్చిన మనమే, సత్యభామ, లవ్ మౌళి అంచనాలను అందుకోలేకపోయాయి. వీటిలో మనమే మాత్రమే వీకెండ్ వరకు ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత అది చల్లబడిపోయింది. ఇక ఈ శుక్రవారం విషయానికి వస్తే.. గత రెండు వారాల్లో మాదిరే ఈ వీకెండ్లో కూడా మూడు సినిమాలు రిలీజయ్యాయి. ఆ మూడింటికీ ఉన్నంతలో మంచి టాక్ రావడం శుభ సూచకమే.
సుధీర్ బాబు చిత్రం హరోం హరలో.. కేజీఎఫ్, పుష్ప సినిమాల ఛాయలు కనిపించినా టాక్ అయితే పర్వాలేదన్నట్లే వస్తోంది. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా బాగానే నచ్చుతోంది. సుధీర్ గత చిత్రాల ప్రభావం దీని మీద కనిపించలేదు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్‌కు రెస్పాన్స్ బాగుంది. శుక్రవారం ఆక్యుపెన్సీలు బాగానే ఉన్నాయి. సుధీర్‌కు ఈ చిత్రం కొంచెం రిలీఫ్ ఇచ్చేలాగే కనిపిస్తోంది. ఇక ఈ వారం సినిమాలో బెస్ట్ టాక్ తెచ్చుకున్న మూవీ అంటే.. విజయ్ సేతుపతి డబ్బింగ్ చిత్రం మహారాజనే.
రివెంజ్ డ్రామానే డిఫరెంట్ స్టైల్లో ప్రెజెంట్ చేసిన దర్శకుడు ప్రేక్షకుల మనసులు గెలిచాడు. క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద అసెట్ అయింది. డబ్బింగ్ సినిమా అయినా దీనికి ప్రేక్షకులు బాగానే వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక తక్కువ అంచనాలతో విడుదలైన మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి సందేశంతో కూడిన కథాంశం, అజయ్ ఘోష్ నటన సినిమాలో హైలైట్. టాక్ స్ప్రెడ్ అయితే దీనికి జనం పెరిగే అవకాశముంది. మొత్తంగా టాలీవుడ్‌కు ఇది
This post was last modified on June 15, 2024 7:18 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…