జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 విడుదల అక్టోబర్ 10 ఉంచి సెప్టెంబర్ 27కి మారడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. అదే డేట్ ని గతంలో ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ఓజి వాయిదా వార్త ఇంకా అధికారికంగా చెప్పనప్పటికీ అనఫీషియల్ గా ఎప్పుడో డ్రాపయ్యారు కాబట్టి ఇంకెలాంటి సందేహం లేదు. దేవరకు సోలోగా ఓపెన్ గ్రౌండ్ దొరకనుంది. పెద్ద వీకెండ్స్ తో పాటు గాంధీ జయంతి లాంటి సెలవులను వాడుకుంటూ దసరా దాకా వీరవిహారం చేసే ఛాన్స్ దొరికింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే భారీ రికార్డులు దక్కడంలో అనుమానం అక్కర్లేదు.
రిలీజ్ ఎప్పుడు ఉన్నా హక్కులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయని ఇన్ సైడ్ టాక్. తెలుగు రాష్ట్రాల మొత్తం పంపిణి హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్స్ సొంతం చేసుకుంటే, నైజం ఏరియాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తారని తెలిసింది.
ఓవర్సీస్ లో భారీ స్క్రీన్ కౌంట్ ఉండేలా హంసిని ఎంటర్ టైన్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. హిందీ వెర్షన్ కు సంబంధించిన హక్కులు అనిల్ తదాని, కరణ్ జోహార్ లు సంయుక్తంగా చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓటిటి రైట్స్ ఫాన్సీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, శాటిలైట్ ఛానల్ స్టార్ మా బుల్లితెర హక్కులను తీసుకుందట.
ఈ మొత్తం కలిపి సుమారు అయిదు వందల కోట్లకు పైగానే బిజినెస్ జరిగిందని ఒక అంచనా. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కోణంలో చూస్తే ఇది భారీ మొత్తం. టేబుల్ ప్రాఫిట్ పైనే దేవర రిలీజవుతుంది.
ఆచార్య తర్వాత మళ్ళీ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్న కొరటాల శివ దేవరకు సంబంధించి బడ్జెట్, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. క్లైమాక్స్ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం గోవా షెడ్యూల్ బిజీగా ఉన్న టీమ్ త్వరలో తారక్, జాన్వీ కపూర్ ల మీద డ్యూయెట్ చిత్రీకరించడం కోసం థాయ్ ల్యాండ్ వెళ్లనుంది. తిరిగి వచ్చాక షూట్ ఎంత బ్యాలన్స్ ఉందనే స్పష్టత వస్తుంది.
This post was last modified on June 14, 2024 10:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…