రేపు విడుదల కాబోతున్న మహారాజ మీద భారీ అంచనాలు లేకపోయినా విజయ్ సేతుపతి ఇమేజ్, ట్రైలర్ లో చూపించిన కంటెంట్ మెల్లగా ప్రేక్షకులను తనవైపు చూసేలా చేస్తోంది.
నిన్న తమిళనాడులో వేసిన స్పెషల్ ప్రీమియర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అదే స్పందన ఇక్కడా వస్తుందనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో ఇవాళ రాత్రి షోలు వేయబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
హైదరాబాద్, వైజాగ్, కర్నూలు తదితర చోట్ల ఆన్ లైన్ అమ్మకాలు షురూ చేశారు. రేపటి పోటీని దృష్టిలో ఉంచుకుని టాక్ కోసం వేసిన తెలివైన స్ట్రాటజీ ఇది.
సెలూన్ షాప్ నడుపుకునే బార్బర్ గా విజయ్ సేతుపతి ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. లక్ష్మి పోయిందంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వడంతో మొదలుపెట్టి ఒక వయొలెంట్ యాంగిల్ ని బయటికి తీసేలా దర్శకుడు నితిలన్ స్వామినాధన్ కొత్త తరహా ట్రీట్ మెంట్ ఇచ్చారట.
చెన్నై నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం చాలా పెద్ద షాకింగ్ ఎలిమెంట్ సినిమాకు హైలైట్ అయ్యిందని, ఇది కనక మన ఆడియన్స్ కి కనెక్ట్ అయితే బ్లాక్ బస్టరేనని అంటున్నారు. అదేంటో ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కానీ అంత సెన్సిబుల్ పాయింట్ ని ఒప్పుకునేలా ఎలా తీశారో తెరమీద చూడాలి.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన మహారాజలో మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఉప్పెనలో పేరు రావడం మినహాయించి విజయ్ సేతుపతికి ఇక్కడ ప్రత్యేకంగా మార్కెట్ అంటూ ఏర్పడలేదు.
తను సోలో హీరోగా నటించినవి చాలా ఫెయిలయ్యాయి. అందుకే మహారాజ మీద పెద్ద బజ్ ఏమి లేదు. హరోంహర, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ పాటు ఇంకో నాలుగు సినిమాలతో పోటీ పడుతున్న మహారాజ్ కనక క్లిక్ అయితే మక్కల్ సెల్వన్ కు పండగే. అంత ధీమాగా తెలుగులో ప్రీమియర్లు వేస్తున్నారంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది.
This post was last modified on June 13, 2024 11:58 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…