దేవర ముంగిట విడుదల తేదీ పంచాయితి

ముందు ప్రకటించుకున్న దాని ప్రకారం దేవర పార్ట్ వన్ విడుదల తేదీ అక్టోబర్ 10. అయితే అదే రోజు రజనీకాంత్ వెట్టయాన్ రాబోతున్నట్టు కొద్దిరోజుల క్రితం నిర్మాతలు ప్రకటించారు. ఈ క్లాష్ వల్ల తారక్ కు ఏపీ, తెలంగాణలో వచ్చే నష్టమేమి లేదు కానీ తమిళనాడు, కర్ణాటక ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి.

పైగా కేరళలోలోనూ థియేటర్ల పరంగా సమస్య వస్తుంది. దీనికన్నా ప్రధాన కారణం వేరొకటుంది. సెప్టెంబర్ 27 నుంచి ఓజి తప్పుకున్నాక కీలకమైన సెలవుల సీజన్ మిస్ అవుతోంది. ముందు జాగ్రత్తగా నాగవంశీ తన లక్కీ భాస్కర్ ని ఆ డేట్ కి లాక్ చేసి ఉంచి తెలివైన పని చేశారు.

దేవర డిస్ట్రిబ్యూషన్ ఎలాగూ ఆయనకే దక్కే అవకాశాలున్నాయి కాబట్టి ఒకవేళ కొరటాల శివ కనక ఓకే అంటే వెంటనే తారక్ కోసం ఆ డేట్ లాక్ అవుతుంది. ఇది ఎందుకు మంచి ఆప్షన్ అవుతుందంటే రెండు వీకెండ్స్ తో పాటు మధ్యలో గాంధీ జయంతి రావడంతో దసరా దాకా ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది.

ఒకవేళ రజని థర్డ్ వీక్ లో వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇదంతా చూసే దేవరను ముందుకు జరిపే నిర్ణయం దాదాపు తీసుకున్నట్టేనని వినికిడి. ఇది జరగాలంటే ఆగస్ట్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. కొరటాల శివ ఖచ్చితంగా అవుతుందంటేనే ప్రకటన వస్తుంది.

అంతా కలిసి మరోసారి చర్చించుకున్నాక సెప్టెంబర్ 27 తేదీతో దేవర కొత్త అనౌన్స్ మెంట్ రావొచ్చు. ప్రస్తుతం గోవాలో కీలక షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ డ్రామా నుంచి మొదటి లిరికల్ సాంగ్ దేవర ముంగిట నువ్వెంత ఇప్పటికీ ఛార్ట్ బస్టర్ అయ్యింది. రెండో పాట మెలోడీని సిద్ధం చేస్తున్నారు.

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన మూవీ రాలేదు. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాబట్టి దేవర కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితర క్యాస్టింగ్ అంచనాలు పెంచేస్తోంది. ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు. చూద్దాం.