‘అంధాధూన్’ రీమేక్‍లో టబు పాత్రలో ఎవరైనా హీరోయిన్ మెటీరియల్ వుండి తీరాలని నితిన్ పట్టుబట్టాడు. నయనతార కోసం ఏకంగా అయిదు కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. కానీ ఆమె అంతకు రెండింతలు ఇస్తే చేస్తానందట. కాజల్‍ని కూడా ట్రై చేసాడు కానీ మరీ వ్యాంపిష్‍గా వుండే విలన్ పాత్ర కావడంతో ఆమె చేయననేసింది. శ్రియను అనుకున్నారు కానీ ఆమెకి ఇప్పుడు హీరోయిన్ ఇమేజ్ లేదు. అందువల్ల సినిమాకు ఏ విధంగాను ప్లస్ అవ్వదు.
ఆ అన్వేషణలో తమన్నా అయితే ఎలాగుంటుందని ఆమెను సంప్రదిస్తే కాజల్ మాదిరిగానే ఆమె ససేమీరా అనేసిందట. ఇంకా హీరోయిన్‍గా నటిస్తోన్న టైమ్‍లో ఆ తరహా నెగెటివ్ క్యారెక్టర్, పైగా వ్యాంప్ ఫీల్ వుండే పాత్ర ఎలా చేస్తానని తటపటాయించిందట. కానీ నితిన్ ఆమెకు రెండు సినిమాలకి వచ్చే పారితోషికం సింగిల్ పేమెంట్‍లో ఇచ్చేస్తానని చెప్పడంతో ఆమె ఇక కాదనలేకపోయింది. ఎలాగో ఆ క్యారెక్టర్ చేస్తే చాలా మంచి పేరు వస్తుందని తమన్నాకు తెలుసు.
తన కెరీర్ టర్న్ తీసుకుని మరిన్ని సంచలనాత్మక పాత్రలు కూడా తనను వెతుక్కుంటూ రావచ్చు. అటు పేరుకి పేరు, ఇటు డబ్బుకి డబ్బు కూడా వచ్చేస్తుండడంతో ఇక తమన్నా పెద్దగా ఆలోచించలేదు. ఎలాగో పెద్ద హీరోల పక్కన తనకు ఛాన్సులు రావడం లేదిపుడు. ఇలాంటి టైమ్‍లో ఈ క్యారెక్టర్ చేయడమంటే తనకు అన్ని విధాలా బోనస్సేనని తమన్నా కరక్ట్ గా క్యాచ్ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates