ఎంత కష్టపడుతున్నా సక్సెస్ అందని ద్రాక్షగా మారిపోయిన సుధీర్ బాబు కొత్త సినిమా హరోంహర ఈ నెల 14 విడుదల కాబోతోంది. ఒకరకంగా చెప్పాలంటే పెద్దగా చెప్పుకునే పోటీ లేకుండా సరైన గ్రౌండ్ దొరికింది. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం పూర్తిగా సద్దుమణిగింది. బ్యాలన్స్ ఉన్న చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం రేపటితో అయిపోతుంది. ఆ మరుసటి రోజు నుంచి జనం యధాతధంగా పాలిటిక్స్ నుంచి తమ దృష్టిని మళ్లిస్తారు. ఫలితాల వేడి వల్లే బెటర్ గా పెర్ఫార్మ్ చేయాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మనమే అంచనాలకు దూరంగానే ఆగిపోయాయి.
ఇప్పుడు హరోంహరకు ఎలాంటి సమస్య లేదు. పోటీలో ఇంకో నాలుగు సినిమాలున్నాయి. అవి అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి, విజయ్ సేతుపతి మహారాజ, ఫాంటసీ మూవీ ఇంద్రాణి, చాందిని చౌదరి యేవమ్. కంటెంట్, బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇవేవి సుధీర్ బాబు మూవీకి సమానంగా లేవు. సో టాక్ కనక పాజిటివ్ వస్తే మంచి వసూళ్లు కళ్లచూడవచ్చు. ట్రేడ్ టాక్ ప్రకారం థియేట్రికల్ బిజినెస్ అయిదు కోట్ల వరకు జరిగిందని, షేర్ కనక ఆరు కోట్లు దాటేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది భారీ మొత్తమేమి కాదు. ఈజీగా రికవరీ చేసుకోవచ్చు
జ్ఞానసాగర్ దర్శకత్వం వహించిన హరోంహర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం మహేష్ బాబు ముఖ్య అతిథిగా జరగనుంది. ఇదయ్యాక ఒక్కసారిగా అందరి ఆడియన్స్ దృష్టి దీనిపై పడుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. సుధీర్ బాబుకి తన సపోర్ట్ ఎప్పుడూ ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఒక బ్లాక్ బస్టర్ తో సూపర్ హిట్ గా నిలిచిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కుప్పం బ్యాక్ డ్రాప్ లో సుబ్రహ్మణ్యం అనే తుపాకులు తయారు చేసే యువకుడి కథగా హరోంహర తెరకెక్కింది. మంచి మాస్ సినిమా చూసి నెలలు గడిచిపోతున్న టైంలో దీని విజయం మీద ట్రేడ్ ఆశలు పెట్టుకుంది.
This post was last modified on June 11, 2024 3:14 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…