రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారనే వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇవాళ జరిగిన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యేల మీటింగ్ లో అధ్యక్షుడి ఎంపిక తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన ఏమైనా వస్తుందేమో అనుకుంటే రేపే చూడమంటూ బాబు సస్పెన్స్ లో పెట్టేశారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మాత్రం ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ తెగ వాడేస్తున్నారు. చిరంజీవికి స్టేజి గెస్టుగా ప్రత్యేక ఆహ్వానం వెళ్లడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఒకవేళ నిజమైతే ముందుగా సంబరపడేది టాలీవుడ్డే. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోని పరిశ్రమ అదే తరహా సహకారం ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుకుంటోంది. జగన్ సర్కారు ఉన్నంత కాలం అది జరగలేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి పలుమార్లు ఎంతో సహాయసహకారాలు అందించిన చంద్రబాబునాయుడుతో పాటు ఉప పీఠం పై పవన్ కళ్యాణ్ ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. పైగా నిర్మాతల సాధక బాధలు అన్నీ ప్రత్యక్షంగా చూసిన హీరో కాబట్టి ఖచ్చితంగా సానుభూతి కోణంలోనే నిర్ణయాలు ఉంటాయని చెప్పనక్కర్లేదు.
రేపటికి దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ నెల 27 విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి నుంచే ప్రత్యేక వెసులుబాట్లు ఉండే అవకాశం లేకపోలేదు. టికెట్ రేట్లు, స్పెషల్ షోలకు ఎలాంటి అక్కర్లేని అడ్డంకులు ఉండవని తెలుస్తోంది. పరిశ్రమ ప్రాథమికంగా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ షూటింగులు, డిస్ట్రిబ్యూషన్లు, స్టూడియోలు, ఈవెంట్ల తాలూకు వేదికలు ఇతరత్రా ఎన్నో వ్యవహారాలు ఏపీతో ముడిపడి ఉన్నాయి. పైగా రెవిన్యూ పరంగా ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలు చాలా కీలకం. ఇకపై పవన్ కళ్యాణ్ గెస్టుగా రావాల్సిన సినిమా వేడుకలు ఎన్ని ఉండబోతున్నాయో లెక్కచెప్పడం కష్టం.
This post was last modified on June 11, 2024 3:12 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…