ఎనర్జిక్ స్టార్ రామ్ తొలి సినిమా దేవదాసు ఎంత బ్లాక్ బస్టరో తెలిసిందే. పదిహేడు కేంద్రాల్లో ఒక కొత్త హీరో చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం మళ్ళీ ఎవరికి సాధ్యపడలేదు. అలాని ఇది మొదటి ఆట నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ కాదు. దీని వెనుక షాకింగ్ సంగతులు ఉన్నాయి. నందమూరి జానకిరామ్ అబ్బాయి తారకరామారావుని పరిచయం చేయబోయే ప్రాజెక్టుతో దర్శకుడు వైవిఎస్ చౌదరి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా జరిగిన లాంచ్ ఈవెంట్ లో పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ దేవదాస్ గురించి ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
దేవదాసు 2006 సంక్రాంతి జనవరి 11 రిలీజయ్యింది. ఆ పండక్కు ప్రేమకథలు ఆడవని తెలిసినా కూడా చౌదరి రిస్క్ చేశాడు. పది కోట్లకు పైగా బడ్జెట్. ఏమాత్రం అటుఇటు అయినా అంతే సంగతులు. మరుసటి రోజు స్టైల్ వచ్చింది. లారెన్స్ హీరోగా చిరంజీవి, నాగార్జున క్యామియోలు చేయడంతో దానికి పిచ్చ క్రేజ్. నెక్స్ట్ డే యూత్ హార్ట్ త్రోబ్ గా ఉన్న సిద్దార్థ్ చుక్కల్లో చంద్రుడికి కుర్రకారు క్యూ కట్టారు. చివరిగా అసలైన ఫెస్టివల్ బొమ్మ అనిపించుకున్న లక్ష్మి వచ్చింది. వెంకటేష్ ఇమేజ్ తెలిసిందే. ఇంత పోటీ మధ్య దేవరాజు విపరీతంగా నలిగిపోయి ఒకరకంగా డెడ్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది.
ఇంత జరిగినా చౌదరి పట్టు వదలకుండా థియేటర్లకు వెళ్లి జనం ఉన్నా లేకపోయినా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. రామ్ కు ఇమేజ్ లేని కారణంగా భారం మొత్తం తనమీదే పడింది. జీ ఛానల్ కు అతి తక్కువ ధరకు శాటిలైట్ హక్కులు అమ్మాల్సి వచ్చింది. నాలుగు వారాలు అతికష్టం మీద గడిచాక ఆసలు సునామి మొదలైంది. జనం హౌస్ ఫుల్స్ చేయడం మొదలుపెట్టారు. వంద రోజులు దాటినా పరుగు ఆగలేదు. చాలా చోట్ల రికార్డులు బద్ధలయ్యాయి. రూపాయి బిజినెస్ జరగని రామ్ మీద కోట్ల వసూళ్లు ఇచ్చానని చౌదరి చెప్పడం గమనార్హం. మొత్తానికి దేవదాసు పేరులోనే బోలెడు కష్టాలున్నాయి కాబోలు.
This post was last modified on June 10, 2024 4:46 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…