థియేటర్ రిలీజ్ కు ఓటిటికి మధ్య సరిపడా గ్యాప్ ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నా నిర్మాతలు దానికి కట్టుబడటం కష్టసాధ్యమైపోయింది. మే 31న భారీ అంచనాల మధ్య విడుదలైన గ్యాంగ్స్ అఫ్ గోదావరి జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
అంటే డిజిటల్ విండో కేవలం రెండు వారాలే. ఈ సినిమా అంచనాలు పూర్తిగా అందుకోని మాట వాస్తవమే కానీ మరీ ఘోరమైన వసూళ్లు దక్కలేదు. టీమ్ అధికారికంగా చెప్పిన ప్రకారమే మొదటి వీక్ ఎండ్ లోనే 80 శాతం రికవరీ జరిగింది. ఇంకా రన్ కొనసాగుతూనే ఉంది.
అలాంటప్పుడు ఇంత త్వరగా ఓటిటిలో వచ్చేయడం దేనికి సంకేతమిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం అనుకోవడానికి లేదు. అగ్రిమెంట్ టైంలోనే స్పష్టంగా తేదీతో సహా లాక్ చేసుకుంటారు.
సో ఫలితాన్ని ముందే ఊహించి నిర్మాత నాగవంశీ ఒప్పందం చేసుకున్నారా లేక త్వరగా స్ట్రీమ్ చేసుకునేందుకు అదనపు మొత్తాన్ని ఏమైనా ఆఫర్ చేశారేమో తెలియదు. గతంలో ఇదే సంస్థ నుంచి వచ్చిన గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ లు నెల రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో రాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరికి ఆ మాత్రం స్పేస్ కూడా ఇవ్వకపోవడం అసలు ట్విస్టు.
ఈ లెక్కన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి రెండో భాగం ఉండటం అనుమానంగానే ఉంది. రిలీజ్ రోజు సక్సెస్ మీట్ లో దర్శకుడు చైతన్య కృష్ణ ఖచ్చితంగా సీక్వెల్ తీస్తామని అన్నాడు కానీ ఇప్పుడు మాత్రం డౌట్ వస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని అందుబాటులోకి తెస్తున్నారు.
కొత్త సినిమాల హక్కుల విషయంలో విపరీతమైన దూకుడు చూపిస్తున్న నెట్ ఫ్లిక్స్ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సర్ప్రైజ్ లు చాలా ఇచ్చేలా ఉంది. విశ్వక్ సేన్ కెరీర్ లోనే పాత్ బ్రేకింగ్ మూవీగా నిలుస్తుందన్న సినిమా ఇంత తక్కువ థియేట్రికల్ రన్ దక్కించుకోవడం బ్యాడ్ లక్.
This post was last modified on June 9, 2024 4:20 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…