సాధారణంగా మీడియా అయినా.. టీవీ అయినా.. వ్యాపార రంగంలో ఉన్న వారు.. నష్టాలు వస్తే.. ఏ పనీ చేయరు. లాభాల పంట పండేవే కోరుకుంటారు. ఏ చిన్న నష్టం వస్తుందని తెలిసినా.. సదరు కార్యక్రమా లకు వెంటనే బ్రేకేలు వేసేస్తారు. మరికొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కానీ, రామోజీ రావు.. మాత్రం తను ప్రారంభించిన వాటిలో సమాజ హితమే కాకుండా… చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంలోనూ.. చరిత్రను వారికి అందించడంలోనూ.. వ్యయ ప్రయాసలు ఎదురైనా.. వెనుకడుగు వేయలేదు. ఇలాంటివి కొన్ని చూద్దాం..
మాల్గుడి కథలు: ఈటీవీ ప్రారంభించిన తర్వాత… ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మాల్గుడికథలను ప్రసారం చేశారు. వీటికి మొదట్లో మంచి ఆదరణ లభించినా.. పోటీ చానెళ్లు ప్రారంభించిన వేరే కార్యక్రమాల ఎఫెక్ట్ పడింది. దీంతో వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. అయినప్పటికీ.. రామోజీ రావు.. ఆసాంతం పూర్తయ్యే వరకు వీటిని కొనసాగించారు. నష్టాలు వచ్చినా.. యాడ్స్ రాకపోయినా భరించారు.
అమరావతి కథలు: సత్యం శంకరమంచి రాసిన పుస్తకం ఆధారంగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే రూపొందిం చిన అమరావతి కథలు కూడా.. సమాజ హితం కోసం ప్రసారం చేసినవే. కానీ ఇవి కూడా.. ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయినా.. ప్రసారాలను కొనసాగించారు.
పంచతంత్రం: చిన్నారులను చైతన్య పరిచే.. వారిలో బుద్ధి కుశలతను పెంచే పంచతంత్ర కథలు ఎన్నదగినవి. పరవస్తు చిన్నయ సూరి రాసిన కథల ఆధారంగా రూపొందించిన ఈ తొలు బొమ్మలాటలను సుదీర్ఘంగా కొనసాగించారు. వీటికి కూడా..యాడ్స్ రాలేదు. అయినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
భాగవతం: మహాభారతంలోని కీలక ఘట్టమైన భాగవతాన్ని వ్యయ ప్రయాసలు ఓర్చి.. బాపు దర్శకత్వం, రమణ సాహిత్య సహకారంతో 350 ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. ఆదిలో జోరుగా సాగిన భాగవతం సీరియల్.. మధ్యలో చిక్కులు పడింది. రామోజీ కుమారుడే.. బాపును తప్పుకోమనడంతో ఇబ్బందులు వచ్చాయి. అయినా.. కుమారుడి కోరిక మేరకు.. సుమన్ దర్శకత్వంలోనే వీటిని కొనసాగించారు.
బాల భారతం: పిల్లల కోసం.. తీసుకువచ్చిన సచిత్ర కథాప్రపంచం బాల భారతం. తొలినాళ్లలో పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. తర్వాత.. ఇప్పుడు ఈటీవీ లో బాల భారతం ప్రత్యేక ఛానెల్ ప్రసారంలో ఉంది. దీనికి కూడా పెద్దగా లాభాలు లేవు. అయినా.. కొనసాగిస్తున్నారు. ఇది రామోజీ రావు అభిరుచి.
తెలుగు వెలుగు: ఇది మాస పత్రిక. తెలుగు వెలుగులకు పట్టం కడుతూ.. 2015లో తీసుకువచ్చిన పత్రిక ఇది. అయితే.. ఇది కొన్నాళ్ల వరకు ఆదరణ పొందినా.. తర్వాత.. ప్రింటింగ్ నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో పత్రిక కొనసాగుతోంది. ఇలా.. రామోజీ రావు.. తన వ్యాపారంలో నష్టాలు వచ్చినా.. ఇష్టానికి పెద్ద పీట వేసిన.. ఘటనలు అనేకం ఉన్నాయి.
This post was last modified on June 8, 2024 5:58 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…