గుంటూరు కారం దాకా వరస అవకాశాలతో దూసుకుపోయిన శ్రీలీల ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి ఇంకా టైం పట్టేలా ఉంది కాబట్టి నిదానంగా కథలు వింటూ గతంలోలా తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. రవితేజ హీరోగా భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార సంస్థ నిర్మించబోయే చిత్రంలో తనే హీరోయిననే లీక్ ఆల్రెడీ బయటికి వచ్చింది కానీ అధికారిక ప్రకటన రాలేదు. తమిళ హీరో విజయ్ సరసన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్ లో స్పెషల్ సాంగ్ అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించిందనే టాక్ గట్టిగానే తిరిగింది.
ఇదిలా ఉండగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు లేటెస్ట్ అప్డేట్. సీనియర్ హీరో, దేవరతో తెలుగులో విలన్ గా పరిచయమవుతున్న సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీకి తననే ఎంచుకున్నట్టు తెలిసింది. మాద్దాక్ ఫిలింస్ బ్యానర్ పాటి జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రూపొందుతుందని సమాచారం. ఆగస్ట్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నారట. ఇపుడో రేపో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది. ఇబ్రహీం తండ్రి సైఫ్ అలీ ఖాన్ విడాకులు తీసుకున్న మొదటి భార్య సంతానం. రెండో భార్య కరీనా కపూర్.
తన సీనియర్లు కాజల్, రాశి ఖన్నా, తమన్నలా కాకుండా శ్రీలీల చాలా త్వరగా బాలీవుడ్ అడుగులు వేస్తోంది. కాకపోతే సక్సెస్ కావడం చాలా ముఖ్యం. ఒకపక్క సాయిపల్లవి అమీర్ ఖాన్ కొడుకుతో జట్టు కట్టిన టైంలోనే శ్రీలీలకి ఈ ఆఫర్ రావడం గమనార్షం. డాన్సుల విషయంలో ఇప్పుడున్న హీరోయిన్లలో బాగా వేగంగా పేరు తెచ్చుకున్న శ్రీలీలకు అక్కడా ఇలాంటి గుర్తింపు దక్కితే మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతుంది. గత ఏడాది భగవంత్ కేసరితో హిట్టు కొట్టి మూడు వరస ఫ్లాపులు చవి చూసిన శ్రీలీలకు రెండు సాలిడ్ హిట్లు పడితే ఒక్కసారిగా కెరీర్ అమాంతం ఎగబాకుతుంది.
This post was last modified on June 8, 2024 1:11 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…