ప్రయాణం, ఊసరవెల్లి లాంటి తెలుగులో సినిమాలతో పాటు హిందీలోనూ కొన్ని సినిమాలు చేసిన ముంబయి భామ పాయల్ రాజ్‌పుత్.. బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.
ఆమె ఆరోపణల్లో నిజమెంత.. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇన్నేళ్లు దాచిపెట్టి ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తోంది.. అనురాగ్ నరేంద్ర మోడీ సర్కారు మీద ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో భాజపా వర్గీయులు వెనుక ఉండి పాయల్‌తో ఆరోపణలు చేయించారా.. లాంటి అనేక సందేహాలు తలెత్తుతున్న మాట వాస్తవమే కానీ.. అదే సమయంలో ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టి పారేయడానికీ లేదు. ఈ విషయంలో కొందరు బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ వైపు నిలబడే ప్రయత్నం చేశారు. అందులో ఆయనకు సన్నిహితురాలైన తాప్సి పన్ను కూడా ఒకరు.
ఐతే సినీ పరిశ్రమలో అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాల విషయంలో తాప్సి గతంలో స్పందించిన తీరుకు.. ఇప్పుడు రెస్పాండైన వైనానికి పొంతన లేకపోవడంతో నెటిజన్లు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట ‘మీ టూ’ ఉద్యమం గట్టిగా సాగిన సమయంలో.. తమపై జరిగిన అఘాయిత్యాల గురించి చెప్పుకున్న అమ్మాయిలకు మద్దతు ఇవ్వకపోగా, వాళ్ల మీద ఎదురు దాడి చేస్తారా అని ఆమె ట్విట్టర్లో ప్రశ్నించింది. అంతే కాక ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందంటే.. సాటి మహిళలే మద్దతు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది.
ఐతే ఇప్పుడు పాయల్ తనను అనురాగ్ లైంగికంగా వేధించాడని అంటుంటే.. ఆమె వెర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అనురాగ్‌కు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టేసింది తాప్సి. అతణ్ని మించిన ఫెమినిస్టు లేడని.. తన సినిమాల్లో మహిళల్ని గొప్పగా చూపించాడని అంటూ పరోక్షంగా పాయల్ ఆరోపణల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవాలన్నట్లుగా మాట్లాడింది తాప్సి. మరి సాటి మహిళ ఇప్పుడు తన బాధ చెప్పుకుంటుంటే తాప్సి ఆమెకు యాంటీగా నిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ నెటిజన్లు ఆమె హిపోక్రసీని బయటపెట్టి ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on September 20, 2020 2:21 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…