ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వం ఎవరిదో స్పష్టత వచ్చేసింది. ప్రమాణ స్వీకార లాంఛనం ఇంకో వారం రోజుల్లో అయిపోతుంది. ఇక టాలీవుడ్ ప్రపంచంలోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఇంకోవైపు స్కూళ్ళు, కాలేజీలు జూన్ 12 నుంచి తెరవబోతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్ కు చాలా కీలకం కానుంది. తెలుగు జనాలకు వినోదం పరంగా మొదటి ప్రాధాన్యం థియేటరే కాబట్టి ఇక నుంచి టికెట్ కౌంటర్లు బిజీగా మారాలని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. పైకి రెండు మూడు హైలైట్ అవుతున్నాయి కానీ డబ్బింగులతో కలుపుకుని రేపు ఏకంగా 11 సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.
శర్వానంద్ ‘మనమే’కు ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా మంచి బజ్ ఉంది. దాన్ని నిలబెట్టుకుంటే చాలు నాని హాయ్ నాన్న తరహాలో చక్కని విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. సెన్సార్ టాక్ పాజిటివ్ గా వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ క్రైమ్ లవర్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ అన్ని వర్గాలను, ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. నిన్న మహిళల కోసం స్పెషల్ షో కూడా వేశారు. నవదీప్ హీరోగా నటించిన ‘లవ్ మౌళి’ యూత్ ని రప్పిస్తుందనే ధీమా మేకర్స్ లో ఉంది. దానికి తగ్గట్టే లవ్, రొమాన్స్ ని ఘాటుగా దట్టించినట్టు ప్రమోషన్లలో అర్థమైపోయింది.
పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘రక్షణ’ మీద బజ్ లేకపోయినా టాక్ ని నమ్ముకున్నారు దర్శక నిర్మాత. బేబీ అసలు కథ నాదేనంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన దర్శక రచయిత శిరిన్ శ్రీరామ్ అదే స్టోరీగా చెప్పబడుతున్న ‘ప్రేమించొద్దు’ రేపే వస్తోంది. ఇవి కాకుండా నమో, గోల్డ్ నెంబర్ వన్, ఓసిలు బరిలో ఉన్నాయి. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన తమిళ అనువాదం ‘వెపన్’కు ఒరిజినల్ లో ఉన్న హైప్ ఇక్కడ లేదు. పిల్లల చిత్రం చోటా భీం అండ్ కర్స్ అఫ్ దంయాన్, హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డైలు వస్తున్నాయి. రీ రిలీజ్ ప్రేమకథా చిత్రమ్, భారతీయుడు, చక్రం వాయిదా పడ్డాయి.
This post was last modified on June 6, 2024 1:14 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…