సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో వారసులందరూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ పెద్దగా నటనలో పేరు తెచ్చుకోకపోయినా, కేవలం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కారణంగా అవకాశాలు అందుకుంటున్న సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి వాళ్లకు సోషల్ మీడియా హీట్ మామూలుగా లేదు. మామూలుగానే సోనమ్‌ను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తుంటారు. ఈ మధ్య అది మరీ ఎక్కువైంది. హేట్ కామెంట్లతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా ఒక మహిళ తనను, తన భర్తను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేసిందంటూ సోనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్వీట్‌ను షేర్ చేసి.. ఆమెపై తన ఆగ్రహాన్ని చూపించింది. ఇంతకీ సోనమ్‌కు ఆ మహిళ పెట్టిన ట్వీట్‌లో ఏముందంటే..
‘‘మీ నాన్న లేకపోతే నువ్వు జీరో. నీకు నటించడం రాదు. నీ కుటుంబ నేపథ్యం వల్లే నువ్వు కొన్ని సినిమాలు చేయగలిగావు. నీలాంటి వాళ్లు సమాజంలో నెగిటివిటీనీ వ్యాప్తి చేశారు. నీలాంటి మహిళకు భారత్‌తోపాటు ఈ ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషకరం. నీ భర్త చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. మరోసారి ఆయణ్ని చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంది’’ అని ఆ మహిళ కామెంట్ చేసింది. దీనికి సోనమ్ బదులిస్తూ.. ‘‘ఈ మహిళ నాకు నీచమైన మెసేజ్ పంపింది. ఇలాంటి మెసేజ్‌ల ద్వారా ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటోంది. నా దృష్టిలో పడడానికే నువ్వు ఈ మెసేజ్ పంపావని తెలుసు. ఆమె వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఇంత ద్వేషం మనసులో ఉంటే అది వాళ్లనే నాశనం చేస్తుంది’’ అని పేర్కొంది. అయితే సదరు మహిళ ఈ మెసేజ్‌కు స్పందిస్తూ.. తన అకౌంట్ హ్యాక్ అయిందని, తానెప్పుడూ ఇలాంటి హేట్ మెసేజ్‌లు పంపనని పేర్కొడం గమనార్హం.
This post was last modified on September 20, 2020 1:15 am
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…