Movie News

‘రంగీలా’లో నాగ్, రజినీ, శ్రీదేవి!

రంగీలా సినిమాలో నాగార్జున, రజినీకాంత్, శ్రీదేవి ఏంటి? అని ఆశ్చర్యం కలుగుతోందా? రామ్ గోపాల్ వర్మ ముందు అనుకున్న ప్రకారం అయితే ఆ సినిమాలో ఆ ముగ్గురే నటించాల్సిందట. ప్రధాన పాత్రల్ని ఈ ముగ్గురి దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దాడట. ఈ విషయాన్ని ‘రంగీలా’ ఒరిజినల్ హీరోయిన్ ఊర్మిళనే స్వయంగా వెల్లడించడం విశేషం. ఈ లెజెండరీ మూవీ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందమంతా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.

ఓ ఇంటర్వ్యూలో ఊర్మిళ మాట్లాడుతూ.. వర్మ దృష్టిలో కథానాయికగా ముందు తాను లేనని.. ఆయన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవిని ‘రంగీలా’గా చూపించాలని వర్మ అనుకున్నాడని వెల్లడించింది. అలాగే ఆమిర్ ఖాన్ చేసిన మున్నా పాత్రలో నాగార్జునను, జాకీష్రాఫ్ చేసిన సినీ హీరో పాత్రలో రజినీ కాంత్‌ను పెట్టాలని ఆయన అనుకున్నారని.. ఐతే అనుకోకుండా తాను ఆమిర్ ఖాన్, జాకీష్రాఫ్ ఆ సినిమాలోకి వచ్చామని ఆమె వెల్లడించింది. ‘శివ’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించిన వర్మ.. ‘రంగీలా’తో స్ట్రెయిట్ హిందీ సినిమా తీసి అక్కడా జెండా పాతాడు.

శ్రీదేవి అంటే వర్మకు ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆమెను ‘రంగీలా’లా చూపించి ఉంటే కూడా బాగుండేదేమో కానీ.. ఈ సినిమాతో ఊర్మిళ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాకు అలాంటి ఫ్రెష్ హీరోయిన్ అయితేనే ఇలాంటి ఔట్ పుట్ వచ్చేదేమో. ‘రంగీలా’ కథాకథనాలు, సంగీతం, హీరోయిన్ అందాలు.. ఆమిర్, జాకీల నటన.. ఇలా అన్నీ హైలైటే అయ్యాయి. ఈ సినిమా తర్వాత వర్మ వెనుదిరిగి చూసుకోలేదు. దశాబ్దం పాటు బాలీవుడ్‌ను ఏలాడు.

This post was last modified on September 20, 2020 1:06 am

Share
Show comments
Published by
suman

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago