Movie News

ఏపీ ఫ‌లితాలు.. క‌ల్కికి బూస్టా వ‌ర‌స్టా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ కూడా ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తోంది. రాజ‌కీయాల‌తో సినిమా వాళ్ల‌కు ఎప్పుడూ సంబంధాలు ఉన్నాయి, రాజ‌కీయాల ప్ర‌భావం సినిమాల మీదా ప‌డుతుంటుంది.

కానీ గ‌త ఐదేళ్ల‌లో వైఎస్సార్ కాంగ్రెస్ హ‌యాంలో మాత్రం ఫిలిం ఇండ‌స్ట్రీ ఏపీలో బాగా ఒడుదొడుకులు ఎదుర్కొంది. అందుకే ఆ ప్ర‌భుత్వం పోయి కూట‌మి అధికారంలోకి రావాల‌నే ఆకాంక్ష మెజారిటీ సినీ జ‌నాల్లో ఉంది. ప్ర‌భుత్వం మారితే నిర్మాత‌ల‌కు క‌చ్చితంగా మంచి రోజులు వ‌చ్చిన‌ట్లే అని భావిస్తున్నారు.

ఏపీలో ఏర్పాట‌య్యే ప్ర‌భుత్వం ఆధారంగా బాగా ప్ర‌భావితం అయ్యే తొలి చిత్రం.. క‌ల్కినే. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్లో నిర్మించిన అశ్వినీద‌త్.. తెలుగుదేశం మ‌ద్ద‌తుదార‌న్న సంగ‌తి తెలిసిందే. వైకాపాతో ఆయ‌న‌కు అస్స‌లు ప‌డ‌దు. ఓపెన్‌గా ఆ పార్టీని, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న విమ‌ర్శించారు. కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికారు.

ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ జ‌గ‌న్ స‌ర్కారు వ‌స్తే.. క‌చ్చితంగా క‌ల్కి సినిమాను టార్గెట్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఏదో ర‌కంగా అడ్డంకులు త‌ప్ప‌వు. ఇలాంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు మామూలుగా ఇచ్చే అద‌న‌పు రేట్లు ఉండ‌క‌పోవ‌చ్చు.

వేరే ర‌క‌మైన ఇబ్బందులు కూడా ఎదురు కావ‌చ్చు. ఒక‌వేళ ప్ర‌భుత్వం మారితే మాత్రం క‌ల్కి పంట పండిన‌ట్లే. కోరుకున్న స్థాయిలో అద‌న‌పు రేట్లు వ‌స్తాయి. అద‌న‌పు షోల‌కు ఇబ్బంది ఉండ‌దు. అలాగే బెనిఫిట్ షోలు కూడా అందుబాటులోకి వ‌స్తాయి.

ఇది ఆ సినిమా ఆదాయంలో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల‌కు దారి తీస్తుంది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం మార‌కుంటే డెంట్ కూడా గ‌ట్టిగానే ప‌డుతుంది. అందుకే ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం క‌ల్కి టీం మిగ‌తా వాళ్ల కంటే ఎక్కువ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. ఐతే స‌ర్వేల‌న్నీ చాలా వ‌ర‌కు కూట‌మికే ప‌ట్టం క‌ట్టిన నేప‌థ్యంలో అశ్వినీదత్ అండ్ కో ధీమాతోనే ఉన్నారు.

This post was last modified on June 4, 2024 6:59 am

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

1 hour ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

2 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

5 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

7 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago