Movie News

పిక్ టాక్: రాశి రాంపేజ్

అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు తక్కువగా ఉంటారు. రాశి ఖన్నా ఆ కోవకే చెందుతుంది. మొదట్లో ఆమెను సగటు గ్లామర్ హీరోయిన్ అనే అనుకున్నారు. కానీ ‘తొలి ప్రేమ’ చిత్రంతో తనెంత మంచి నటో రుజువు చేసుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది.

ఆమె ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి చిత్రాల్లో ట్రెడిషన్ లుక్స్‌లో ఎంత ముద్దుగా కనిపించిందో.. ‘బెంగాల్ టైగర్’ లాంటి చిత్రాల్లో అంత సెక్సీగా కనిపించి మెప్పించింది. ఐతే కెరీర్లో ఒక టైంలో మంచి రైజ్‌లో కనిపించిన రాశి.. ఈ మధ్య కొంచెం డౌన్ అయింది. ఐతే తెలుగులో అవకాశాలు తగ్గినా.. వేరే భాషల్లో ఆమె మెరుస్తూనే ఉంది.

మళ్లీ తెలుగులో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది రాశి. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’తో పాటు ఇటీవలే మరో అవకాశాన్ని కూడా దక్కించుకుంది. ఒకప్పటితో పోలిస్తే రాశి స్లిమ్‌గా తయారవడమే కాదు.. సూపర్ సెక్సీగా కనిపిస్తూ కుర్రకారుకు వల విసురుతోంది.

ఈ మధ్యే ‘ఆరణ్మయి-4’ చిత్రంలో ఒక పాటలో అందాలు ఆరబోసిన రాశి.. ఫొటో షూట్లలో ఇంతకంటే సెక్సీగా కనిపిస్తుంటుంది.

తాజాగా మోడర్న్ ఔట్ ఫిట్‌లో ఆమె చేసిన ఫొటో షూట్.. స్ట్రైకింగ్‌గా ఉంది. తన లుక్స్.. కుర్రాళ్ల గుండెలకు రంపపు కోతే అని చెప్పొచ్చు. ఇది రాశి రాంపేజ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ ఫొటోలు చూసి.

This post was last modified on June 3, 2024 5:13 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago