‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ. అంతకుముందే అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా అది ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ ‘ఆర్ఎక్స్ 100’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ ఛాన్సులు వస్తున్నాయి కదా అని చకచకా సినిమాలు చేసేయడం చేటు చేసింది.
‘ఆర్ఎక్స్ 100’ 2018 విడుదల కాగా.. తర్వాతి ఐదేళ్లలో అతను హీరోగా అరడజను సినిమాలు చేసేశాడు. కానీ వాటిలో ఒక్కటీ విజయవంతం కాలేదు. విలన్‌గా చేసిన గ్యాంగ్‌లీడర్, వలిమై కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో కార్తికేయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఐతే పూర్తిగా ఆశలు కోల్పోయిన స్థితిలో కార్తికేయ వరుసగా రెండు హిట్లు కొట్టడం విశేషం.
గత ఏడాది కార్తికేయ నుంచి వచ్చిన ‘బెదురులంక 2012’ సర్ప్రైజ్ హిట్ అయింది. దాని మీద రిలీజ్‌కు ముందు పెద్దగా అంచనాల్లేవు. కానీ మంచి వినోదం పంచడంతో ఉన్నంతలో బాగా ఆడింది. ఓటీటీలో ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.
ఇక లేటెస్ట్‌గా కార్తికేయ నుంచి ‘భజే వాయు వేగం’ సినిమా వచ్చింది. దీనికి కూడా రిలీజ్ ముంగిట బజ్ లేదు. సినిమా ఆడేలా కనిపించలేదు. అందరి ఫోకస్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మీదే నిలిచింది. కానీ ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరో మూవీ ‘గం గం గణేశా’ మినిమం ఇంపాక్ట్ చూపించలేదు. కానీ ‘భజే వాయు వేగం’ మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకున్న ఈ చిత్రం.. వీకెండ్లో మంచి వసూళ్లే సాధించింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు.. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రావడం సినిమా సక్సెస్‌కు నిదర్శనం. మొత్తానికి కార్తీకేయ కెరీర్ నెమ్మదిగా లైన్లో పడుతున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on June 3, 2024 4:33 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…