Movie News

ఓజీ డేటుకి దేవర?

ముందు అనుకున్న ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ విడుదలై రెండు నెలలు అవ్వాల్సింది. కానీ ఈ చిత్రాన్ని వేసవి రేసు నుంచి తప్పించి.. ఏకంగా అక్టోబరు 10కి వాయిదా వేసేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తారక్ అభిమానులు చాలా ఫీలయ్యారు. వాయిదా అంటే నెలో రెండు నెలలో ఉండాలి కానీ.. మరీ ఆరు నెలలేంటి అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐతే ముందు రిలీజ్ కావడం కంటే.. పర్ఫెక్ట్ సినిమా బయటికి వచ్చి బ్లాక్‌బస్టర్ కావడం ముఖ్యమని తర్వాత వాళ్లే సర్ది చెప్పుకున్నారు. కాగా తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. ‘దేవర’ ఇప్పుడు ఖరారైన డేట్ కంటే రెండు వారాలు ముందే ప్రేక్షకుల ముందుకు రావచ్చని. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ కోసం ఎంచుకున్న సెప్టెంబరు 27 మీద ‘దేవర’ టీం ఫోకస్ చేసిందట.

‘ఓజీ’కి డిజిటల్ హక్కుల విషయంలో ఉన్న ఇబ్బంది వల్ల దాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరు 27కి ‘లక్కీ భాస్కర్’ మూవీని ఫిక్స్ చేసింది ‘సితార ఎంటర్టైన్మెంట్స్’.

పవన్ సినిమా ఆ రోజు రిలీజైతే తామెలా వస్తామని నాగవంశీ ప్రశ్నించడాన్ని బట్టి ‘ఓజీ’ ఆ రోజు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా అక్టోబరు 10న సూపర్ స్టార్ సినిమా ‘వేట్టయాన్’ కూడా రాబోతుండడంతో పాన్ ఇండియా మూవీకి క్లాష్ మంచిది కాదని ‘దేవర’ టీం భావిస్తోంది. అందుకే రెండు వారాలు ముందు, క్రేజీ డేట్ అయిన సెప్టెంబరు 27కి సినిమాను ప్రి పోన్ చేయడం గురించి ఆలోచిస్తున్నారట. ‘లక్కీ భాస్కర్’ కూడా అదే రోజు వచ్చినా పర్వాలేదు, లేదా అవసరమైతే వారం రోజులు వాయిదా వేయించొచ్చు. అందుకే అన్నీ చూసుకుని ఓజీ డేట్‌కు దేవరను ఫిక్స్ చేసే సూచనలున్నాయని అంటున్నారు.

This post was last modified on June 3, 2024 4:20 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

10 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago