ఒక సూపర్ హిట్ సినిమా ద్వారా పరిచయమైన కుర్ర హీరోలకు సమాంతరంగా బ్రేకులు దొరకడం ఉండదు. ఒకరికి త్వరగా మరొకరికి కొంత ఆలస్యంగా విజయ లక్ష్మి తలుపు తడుతుంది. రాహుల్ టైసన్ ది అలాంటి కథే. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ తో పరిచయమైన ఈ యూత్ హీరో అందులో సీనియర్ ని ప్రేమించే కాలేజీ స్టూడెంట్ గా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. వరుణ్ సందేశ్ తరహాలో వేగంగా ఆఫర్లు వస్తాయనుకుంటే టైం అచ్చిరాకేమో కొంత లేట్ అయ్యింది.
దర్శకుడు విఎన్ ఆదిత్యతో చేసిన రైన్ బో, ముగ్గురు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో బ్రేక్ వచ్చింది. ఇటీవలే రిలీజైన భజే వాయు వేగంలో కార్తికేయకు అన్నయ్యగా నటించిన రాహుల్ టైసన్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నటనకు మంచి స్కోప్ దక్కడంతో పాటు మెప్పించే విషయంలో సక్సెస్ కావడంతో మెల్లగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లోనే రూపొందుతున్న మరో చిత్రం నిర్మాణంలో ఉండగా, వార్ బ్యాక్ డ్రాప్ లో ఒకటి, టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా మరొకటి షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
భజే వాయు వేగం ఒక రకంగా బూస్ట్ ఇచ్చేసింది. సరైన కథలు పడితే తిరిగి ఊపందుకునే అవకాశం దక్కింది. రాహుల్ టైసన్ కు యాక్టర్ గా తనకున్న గుర్తింపు ఆడియన్స్ కి త్వరగా కనెక్ట్ అవుతోంది. ఇప్పుడు చేస్తున్న వరస సినిమాలు కనక క్లిక్ అయితే ఇంకోవైపు ఓటిటి బూమ్ ని కూడా అనుకూలంగా మలుచుకోవచ్చు. ఏదైతేనేం తను పోషించిన పాత్ర పట్ల రాహుల్ టైసన్ సంతోషంగా ఉన్నాడు. దీన్ని నిలబెట్టుకునే దిశగా ప్లానింగ్ చేసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ తో చక్కగా సెటిలైపోవచ్చు.
This post was last modified on June 2, 2024 12:23 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…