మాములుగా స్టార్ సినిమా అంటే వీలైనంత ఎక్కువ స్పేస్ తమ హీరోనే కనిపించాలని అభిమానులు కోరుకుంటారు. దర్శకులు ఆ కోణంలోనే ప్రయత్నిస్తారు. కానీ లోకేష్ కనగరాజ్ ఈ ఫార్ములాని సమూలంగా మార్చేశాడు.
విక్రమ్ లో కమల్ హాసన్ పాత్ర కేవలం 47 నిమిషాలే ఉంటుందని ఆయనగా ఒక ఇంటర్వ్యూలో చెప్పేదాకా, కొందరు ఫ్యాన్స్ పసిగట్టే దాకా సామాన్య ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోయారు. అంతగా స్క్రీన్ ప్లే మేజిక్ జరిగిపోయింది. విచిత్రం ఏంటంటే సపోర్టింగ్ రోల్ చేసిన ఫహద్ ఫాసిల్ అందరికంటే ఎక్కువ నిడివి దక్కించుకోవడం. విజయ్ సేతుపతి కూడా అంతే.
తాజాగా భారతీయుడు 2 విషయంలోనూ అదే రిపీట్ కానుందని తెలిసింది. ఈ ప్యాన్ ఇండియా మూవీలో కీలక పాత్ర పోషించిన సిద్దార్థ్ చెబుతున్న దాని ప్రకారం సేనాపతి ఇండియాకు వచ్చే క్రమంలో కమల్ హాసన్ ని కాపాడే ముఖ్యమైన ట్విస్టు తన మీదే జరుగుతుందని, ఇంకా చెప్పాలంటే ఆయన కంటే నేనే తెరపై ఎక్కువ కనిపిస్తానని ఒక తమిళ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వచ్చిన వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అంటే విక్రమ్ కన్నా తక్కువా అంటే చెప్పలేం కానీ దర్శకుడు శంకర్ కమల్ ఇంట్రోని లేట్ గా ప్లాన్ చేశాడని వినికిడి. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ఎపిసోడ్ కాస్త సుదీర్ఘంగా ఉంటుందట.
వచ్చే నెల జూలైలో విడుదల కాబోతున్న భారతీయుడు 2 ఆడియో ఆల్బమ్ ఇవాళ పూర్తిగా విడుదలైపోయింది. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన రెండు పాటలను ఇంతకు ముందు రిలీజ్ చేయగా మిగిలినవన్నీ కలిపి ఈ రోజు అందించేశారు.
1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడుకి కొనసాగింపుగా వస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్, ఎస్జె సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం లాంటి ఆకర్షణీయైన క్యాస్టింగ్ ఉంది. ఫస్ట్ పార్ట్ స్థాయిలో అంచనాలు అందుకోవడం అంత సులభంగా ఉండదు. ఇది రిలీజైతే గేమ్ చేంజర్ కోసం శంకర్ కు కావాల్సినంత టైం దొరుకుతుందని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 1, 2024 8:43 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…