ఈ శుక్రవారం ఒకేసారి మూడు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడింటికీ విడివిడిగా మంచి క్రేజే కనిపించింది. వాటి ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించాయి. వేసవి సీజన్లో కొన్ని వారాల పాటు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఇవి ఊపు తీసుకొస్తాయని భావించారు.
ఐతే రిలీజ్ ముంగిట క్రేజ్ పరంగా వరుస క్రమం చూస్తే.. నంబర్ వన్ స్థాంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కనిపించింది. హీరో విశ్వక్ ‘గామి’ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్నాడు. పైగా సితార ట్రైలర్ ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సితార లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.
‘బేబి’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ‘గం గం గణేశా’ రెండో స్థానంలో నిలిచింది. ఇక కార్తికేయ సరైన విజయాల్లో లేకపోవడం వల్ల ‘భజే వాయు వేగం’ మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ఈ ట్రెండ్ కనిపించింది.
ఐతే రిలీజ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. మూడింట్లో బెస్ట్ టాక్ ‘భజే వాయు వేగం’కే రావడం విశేషం. ఎక్కువ అంచనాల మధ్య రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇటు రివ్యూలు బాలేవు. అటు మౌత్ టాక్ కూడా మిక్స్డ్‌గా వచ్చింది.
టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు డల్ అయిన సంకేతాలు మార్నింగ్ షో నుంచే అర్థమైపోయింది. ‘గం గం గణేశా’కు బ్యాడ్ టాక్ రావడంతో దానికి ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. రెండో రోజు కూడా ఆ చిత్రం పుంజుకునే సంకేతాలు కనిపించడం లేదు. ఇక తొలి రోజు ఉదయం డల్లుగా మొదలైన ‘భజే వాయు వేగం’ పాజిటివ్ టాక్‌తో సాయంత్రానికి పుంజుకుంది.
రెండో రోజు కూడా ఆక్యుపెన్సీలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి అది మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తుందని భావివిస్తున్నారు. అంతిమంగా ‘భజే వాయు వేగం’ ఈ వీకెండ్ విన్నర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on June 1, 2024 5:44 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…