నిన్న విడుదలైన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి రివ్యూలు, టాక్ ఏమంత ఆశాజనకంగా కనిపించకపోయినా ఓపెనింగ్ మాత్రం ఘనంగా దక్కింది. ముఖ్యంగా నెలన్నరకు పైగా సింగల్ స్క్రీన్లలో ఏర్పడ్డ స్లంప్ కి ఊరట కలిగించేలా చాలా బిసి సెంటర్స్ లో ఫుల్స్ నమోదు కావడం విశేషం.
సినిమా ఎలా ఉందో పూర్తిగా తెలియక ముందే మాస్ ప్రేక్షకులు ఓసారి చూసేయాలని ఫిక్స్ కావడంతో మంచి నెంబర్లు కనిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ మాస్ అవతారం, నేహా శెట్టితో పాట, ప్రమోషన్లో చూపించిన కమర్షియల్ కంటెంట్ జనాన్ని మొదటిరోజే వచ్చేలా చేశాయి. భజే వాయు వేగం, గంగం గణేశాలు నెమ్మదిగా మొదలయ్యాయి.
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన వివరాల మేరకు గ్యాంగ్స్ అఫ్ గోదావరి 8 కోట్ల 20 లక్షల గ్రాస్ నమోదు చేసింది. ఇది విశ్వక్ సేన్ కెరీర్లోనే అత్యధికం. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 75 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమా ఇదొక్కటే.
ఇండియా వైడ్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఎక్కువ సేల్స్ చేసినప్పటికీ అది సిని లవర్స్ డే సందర్భంగా 99 రూపాయల టికెట్ పెట్టినందుకు వచ్చిన ఫలితం. కానీ విశ్వక్ మూవీ రెగ్యులర్ రేట్లు అందులోనూ తెలంగాణ గరిష్ట ధరతో అమ్మకాలు చేసుకుని ఇంత కౌంట్ పెట్టడం విశేషం. ప్రస్తుతానికి హోల్డ్ అయితే బాగుంది.
ఇవాళ రేపు వీకెండ్ కనక మంచి గ్రిప్ ఉంటుంది. సోమవారం నుంచి డ్రాప్ ఎంత శాతం ఉంటుందనేది ఫైనల్ స్టేటస్ ని నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇంతే బలంగా నిలబడగలిగితే హిట్టు మార్క్ దాటొచ్చు. వీటి సంగతి ఎలా ఉన్నా గ్యాంగ్స్ అఫ్ గోదావరికి యునానిమస్ టాక్ రాలేదన్నది వాస్తవం.
ఒకవేళ బలమైన ఇంకో మాస్ సినిమా పోటీలో ఉంటే ఏమయ్యేదో కానీ కార్తికేయ, ఆనంద్ దేవరకొండలు అంత కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. మండేకి మూడు సినిమాలకు సంబంధించి మెరుగైన క్లారిటీ వస్తుంది. విశ్వక్ టీమ్ మాత్రం నమ్మకంగా అన్ని వర్గాలను చేరుకున్నామని ధీమాగా చెబుతున్నారు.
This post was last modified on June 1, 2024 11:37 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…