ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న మహేష్ బాబు 29 ప్రకటన ఉంటుందేమోనని ఎదురు చూసిన అభిమానులకు ఆ శుభవార్త అందే సూచనలు లేకపోవడంతో మరికొంత కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. నిజానికి ఈ ప్యాన్ వరల్డ్ మూవీ అనౌన్స్ మెంట్ కి ఇంతకన్నా మంచి రోజు ఉండదనే అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ దర్శకుడు రాజమౌళి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఇంకా పూర్తి చేయకపోవడంతో వాయిదా వేసినట్టు తెలిసింది. హడావిడిగా ఏదీ చేయకూడదని మహేష్ సైతం మద్దతు తెలిపాడట.
ఇతర కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావిడి తీవ్రంగా ఉంది. ఒకేరోజు మూడు మూకుమ్మడిగా దాడి చేశాయి. వాటి కవరేజ్ పనిలో మీడియా బిజీగా ఉంది. ఇంకోవైపు కల్కి 2898 ఏడి హంగామా మొదలైపోయింది. నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జనాల మూడ్ అటువైపు ఉంది. వీటి మధ్యలో ఎస్ఎస్ఎంబి గురించి మాట్లాడితే అటెన్షన్ ఒక్కసారిగా దీనివైపుకు మళ్లుతుంది కానీ అంత అర్జెంట్ ఏముందనేది జక్కన్న ఆలోచన. అసలు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలనే నిర్ణయమే ఇంకా తీసుకోలేదట .
ప్రస్తుతం వర్క్ షాప్స్, కాస్ట్యూమ్స్ ఫోటో షూట్స్ చేస్తున్న రాజమౌళి ఇంకోవైపు క్యాస్టింగ్ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఆర్టిస్టులను ఖరారు చేయాల్సిన లిస్టు పెద్దదే ఉంది . బాహుబలి, ఆర్ఆర్ఆర్ ని మించిన స్కేల్ కాబట్టి ఆషామాషీగా ఉండకూడదు. డేట్ల సమస్య తలెత్తకుండా ప్లాన్ చేసుకోవాలి. రెమ్యునరేషన్లు, బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవాలి. హీరో ఫైనల్ లుక్ ఇంకా ఖరారు చేయలేదు. ఒక్కసారి అది లాక్ చేశాక ఇక బయటకి కనిపించకూడదని డిసైడ్ అయ్యిందట. ఇలా అయితే మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది.
This post was last modified on May 31, 2024 11:10 am
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…