ఒకపక్క రిలీజ్ డేట్లు దొరకడం లేదు మహాప్రభో అంటూ నిర్మాతలు మొత్తుకుంటూనే ఇంకోవైపు వేసవిలో కొన్ని శుక్రవారాలను చేతులారా వదిలేసుకుంటున్నారు. వాటిలో జూన్ 21 ఒకటి. ఆ రోజు చెప్పుకోదగ్గ రిలీజు ఒక్కటీ లేదు.
కారణం సరిగ్గా వారం తిరిగే సరికి జూన్ 27 కల్కి 2898 ఏడి వస్తోంది కనక. ప్రభాస్ తో తలపడేందుకు ఏ ప్రొడ్యూసర్ సాహసించడం లేదు. ఒకవేళ ధైర్యం చేసి జూన్ 21 ఏదైనా ప్లాన్ చేసుకున్నా, టాక్ తో సంబంధం లేకుండా ఏడు రోజులు తిరిగే సరికి నిర్ధాక్షిణ్యంగా థియేటర్లలో నుంచి తమ సినిమాను తీసేస్తారనే ఆందోళనతో ఎందుకొచ్చిన గొడవలెమ్మని మౌనంగా ఉన్నారు.
సో సుధీర్ బాబు హరోం హరకు కొంచెం ఎక్కువ రన్ దొరికే అవకాశం దక్కినట్టు అయ్యింది. అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ 14 రావాలా లేక ఇప్పుడు ఖాళీగా ఉన్న 21 తీసుకోవాలా అనే ఆలోచనలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.
కల్కి ఫీవర్ పది రోజుల ముందు నుంచే మొదలవుతుందనే అంచనాల నేపథ్యంలో అభిమానులతో పాటు ప్రేక్షకులు దాన్ని చూసేందుకు సిద్ధమవుతారు. ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు కాస్త ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో దాన్ని భరించాలంటే ముందు వెనుకా సినిమాలు చూడటం తగ్గించేస్తారు. పైగా కల్కి ఫ్యామిలీస్ మొత్తాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలా చూసుకున్నా ఏదైనా అనూహ్యంగా వస్తే తప్ప జూన్ 21 చప్పగా గడిచిపోనుంది. నిజానికి ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు దండయాత్ర చేసే అతివృష్టికి కారణమైన పోకడ ఎంత ప్రమాదమో గుర్తిస్తే ఇలా వేసవి తేదీలను వృధా చేసుకునే అవసరం పడేది కాదు.
స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్లు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా 2024లో బంగారం లాంటి సమ్మర్ సీజన్ నేలపాలైనట్టే. ఒకటి రెండు హిట్లు మినహాయించి బాక్సాఫీస్ కి పూర్తి కిక్ ఇచ్చిన సినిమా ఏదీ లేకపోవడం ట్రేడ్ ని నిరాశపరిచింది.
This post was last modified on May 31, 2024 10:32 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…