Movie News

మ‌ళ్లీ వార్త‌ల్లోకి అఖిల్ పెళ్లి

హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ విడుదలైన తర్వాతి ఏడాదే, 22 ఏళ్ల వయసులోనే శ్రియ భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకుని పెద్ద షాకే ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఐతే కొన్ని కారణాలతో ఆ నిశ్చితార్థం రద్దయింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టాడు అక్కినేని వారసుడు. ఐతే ఇప్పుడు అతడికి 26 ఏళ్లు వచ్చేశాయి.

ఈ మధ్యలో అఖిల్ ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఏ డిస్కషన్ లేదు. హీరోగా ఇంకా తొలి విజయం అందుకోకపోవడంతో వాటి గురించి ఏం ఆలోచిస్తాడనే అభిప్రాయంతో ఉన్నారంతా. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు మళ్లీ అఖిల్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అతడికి పెళ్లి కుదిరినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్ పెళ్లి జరగబోతోందని అంటున్నారు.

విశేషం ఏంటంటే.. అఖిల్ కోసం ఈ సంబంధం తెచ్చింది అతడి వదిన, నాగచైతన్య భార్య సమంత అట. ఆమె ఇరు కుటుంబాల వాళ్లతో మాట్లాడి ఈ పెళ్లి సెట్ చేసిందట. త్వరలోనే అఖిల్ పెళ్లి గురించి అధికారిక సమాచారం బయటికి వస్తుందని అంటున్నారు. ఐతే ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది అక్కినేని కుటుంబ స్పందనను బట్టే తెలియాలి.

ప్రస్తుతం అఖిల్ అయితే తన కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పనిలో బిజీగా ఉన్నాడు. మేలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. కొన్ని రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగా.. కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యల మధ్య ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభించింది చిత్ర బృందం. అఖిల్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే ఈ షెడ్యూల్లో షూటింగ్‌లో పాల్గొంటోంది. దీని తర్వాత స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్వకత్వంలో అఖిల్ తన ఐదో సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 19, 2020 12:37 pm

Share

Recent Posts

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

22 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

47 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

57 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

1 hour ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago