రేపు మే 31 సినిమా లవర్స్ డేని దేశవ్యాప్తంగా పలు మల్టీప్లెక్సులు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఇండియా వైడ్ సుమారు 4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పాత కొత్త భాషతో సంబంధం లేకుండా ఏ మూవీ అయినా సరే అదే ధరకు ఎంచక్కా ఏసీలో కూర్చుని చూసేయొచ్చు. ఒకవేళ మీరు చెన్నై, ముంబై లాంటి నగరాల్లో ఉంటే రేపటి కొత్త రిలీజులను తక్కువ రేట్ కు ఎంజాయ్ చేయొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులు మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేదు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం, గంగం గణేశా దేనికీ ఇది వర్తించడం లేదు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిమితుల కారణంగా ఇది అమలు చేయలేకపోతున్నామని పైకి చెబుతున్నప్పటికీ కనీసం నూటా యాభై లేదా రెండు వందల రూపాయల లోపైనా ఉంచాల్సిందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. దీనికి అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా బయ్యర్లు చొరవ తీసుకోలేదు. ఉదాహరణకు హైదరాబాద్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి గరిష్ట ధర 295 కాగా పలు మల్టీప్లెక్సుల్లో 250 ఉంది. సింగల్ స్క్రీన్ 150 నుంచి 175 మధ్యలో పెట్టారు. భజే వాయు వేగం, గంగం గణేశాలు కొంచెం తక్కువ పెట్టాయి కానీ అవి కూడా రెండు వందల దాకా వెళ్లాయి. ఏపీలో 177 రూపాయల్లో ఎలాంటి మార్పు లేదు.
ఒకవేళ మల్టీప్లెక్సులన్నీ నిజంగా రేపొక్క రోజు 99 రూపాయలు పెట్టి ఉంటే కనక పైన చెప్పిన మూడు సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్ అయ్యేవని అఫ్ ది రికార్డు ఒక ఎగ్జిబిటర్ ఓపెన్ గా అంటున్నారు. దీనివల్ల పాత ధరలతో వచ్చే షేర్ కన్నా కనీసం రెండింతలు పెరిగే అవకాశం ఉండేదని చెబుతున్నారు. ఇందులో లాజిక్ ఉంది. రేపటి అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ గమనిస్తే ప్రధాన కేంద్రాలు మినహాయించి చాలా చోట్ల టికెట్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. టాక్ వచ్చాక చూద్దాం లెమ్మని ఆగిన ప్రేక్షకులే ఎక్కువ. రిస్క్ అయినా సరే సినీ లవర్స్ డేని పాటించి ఉంటే బాగుండేది.
This post was last modified on May 30, 2024 5:53 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…