Movie News

తుపాకులతో ‘హరోం హర’ మారణ హోమం

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చినా కష్టం, టాలెంట్ తో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న సుధీర్ బాబుకి గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. కాంబోలు చక్కగానే సెట్ అవుతున్నా వాటిని హ్యాండిల్ చేస్తున్న దర్శకుల తడబాటు వల్ల విజయానికి దూరంగా ఉన్నాడు. ఈసారి పూర్తిగా రూటు మార్చేసి కమర్షియల్ జానర్ లోకి వచ్చి చేసిన సినిమా హరోం హర. గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా లేకపోయి ఉంటే మే 31నే రావాల్సిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇప్పుడు జూన్ 14 విడుదలకు రెడీ అయ్యింది. ఇవాళ ట్రైలర్ ని ఆన్ లైన్ లో మహేష్ బాబు ద్వారా లాంచ్ చేయించారు.

ఇది 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) నిరుద్యోగి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటాయి. ఓ స్నేహితుడు(సునీల్) ఇచ్చిన సలహాతో తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి తుపాకీ తయారు చేస్తాడు. అది బ్రహ్మాండంగా పేలడంతో మెల్లగా దాన్నే వ్యాపారంగా మార్చుకుని ఆ ప్రాంతంలో తిరుగులేని స్థాయికి చేరుకుంటాడు. దీనికి తగ్గట్టునే శత్రువులు పుట్టుకొస్తారు. పోలీసులు వెంటపడతారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో రక్తం ఏరులై పారుతుంది. ఈ యుద్ధంలో సుబ్రహ్మణ్యం ప్రయాణం ఏ తీరానికి చేరుకుందో తెరమీద చూడాలి.

దర్శకుడు జ్ఞాన సాగర్ కున్నది ఒక్క సినిమా అనుభవమే అయినా హరోం హరని ఇంటెన్స్  డ్రామాగా మలచిన తీరు ఆసక్తి రేపుతోంది. గన్నులకు హీరోల పేర్లు పెట్టడం, అప్పటి వాతావరణాన్ని ఆర్ట్ వర్క్ ద్వారా పునః సృష్టించడం బాగున్నాయి. సుధీర్ బాబు పాత్రని అమాయకత్వంతో మొదలుపెట్టి అరాచకం వైపు తీసుకెళ్లిన వైనం మెయిన్ పాయింట్ గా కనిపిస్తోంది. హీరోయిన్ మాళవిక శర్మ, సునీల్ మినహా ఇతర ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయలేదు. చేతన్ భరద్వాజ్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం ఎలివేట్ చేశాయి. ఏపీ ఫలితాలు వచ్చాక మంచి టైమింగ్ తో హరోం హర వస్తోంది.

This post was last modified on May 30, 2024 11:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

7 minutes ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

12 minutes ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

1 hour ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

2 hours ago

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు…

2 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

3 hours ago