Movie News

‘బిగ్‍బాస్‍’ ప్లాన్‍ బ్యాక్‍ ఫైర్‍.. ఆడియన్స్ ఫైర్‍!

బిగ్‍బాస్‍ అనేది వృద్ధులు పాల్గొనే రియాలిటీ షో కాకపోయినా కానీ గంగవ్వను ప్రవేశ పెడితే టీఆర్పీలకు బూస్ట్ ఇస్తుందనే ఎత్తుగడతో ఆమెను ఇంట్లోకి పంపించారు. రేటింగులు కూడా ఆమె వల్ల బాగానే వచ్చాయి. ఆమెను కనీసం అయిదారు వారాల పాటయినా హౌస్‍లో వుంచాలని చూసారు. అయితే పొద్దస్తమానం ఇరుగు, పొరుగుతో మాట్లాడుతూ, హాయిగా పొలం పనులు చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య బంధించేస్తే కష్టమనే సంగతిని బిగ్‍బాస్‍ క్రియేటివ్‍ టీమ్‍ ఊహించలేదు.

సకల సౌకర్యాలు ఇచ్చి, అన్నీ చూసుకుంటూ వుంటే ఆమె అడ్జస్ట్ అయిపోతుందని అనుకున్నారు. కానీ గంగవ్వ వల్ల కావడం లేదు. తన వల్ల కావడం లేదని ఆమె కన్నీరు మున్నీరయింది. అయినా కానీ మొదట్లో అలాగే వుంటుంది, తర్వాత అలవాటవుతుంది అంటూ బిగ్‍బాస్‍ ఆమెకు సర్ది చెప్పాలని చూస్తున్నాడు. దీంతో ఆమెకు ఓట్లేసిన జనాలే ఇప్పుడు బిగ్‍బాస్‍ని తిట్టిపోస్తున్నారు. మరికొన్ని రోజులు అక్కడే వుంటే ఆమె మానసిక•గా కృంగిపోతుందని, ఈ వయసులో ఆమెను మరింత కష్టపెట్టవద్దని, ఆమె కోరినట్టుగా పంపించేయాలని సోషల్‍ మీడియాలో స్టార్‍మా హ్యాండిల్‍కి గట్టిగానే అక్షింతలు పడుతున్నాయి.

బహుశా ఈ వారాంతంలో ఆమెను స్వఛ్ఛందంగా బయటకు పంపించేసే అవకాశముంది. ఒకసారి ట్రాన్స్ జెండర్‍ని, ఇంకోసారి వృద్ధురాలిని… లోనికి పంపిస్తూ బిగ్‍బాస్‍ చేసిన ప్రయోగాలు వికటించాయి. ఇకనైనా ఇలాంటి చీప్‍ టీఆర్పీ ట్రిక్కులు కాకుండా కాస్త బుర్ర పెట్టి ఆలోచించి షోని రసవత్తరంగా మారిస్తే బాగుంటుంది.

This post was last modified on September 18, 2020 10:20 pm

Share

Recent Posts

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

11 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

21 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

43 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

1 hour ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago