కర్నాటక డ్రగ్స్ రాకెట్‍లో అరెస్ట్ అయిన ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన పోలీసులకు సవాల్‍గా మారింది. ఆమెకు డ్రగ్స్ రాకెట్‍తో సంబంధమున్నట్టు అనుమానాలు బలంగా వుండడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె డ్రగ్స్ సిండికేట్‍లో భాగస్తురాలని చెప్పడానికి, ఆమె డ్రగ్స్ అమ్మిందని కానీ, తీసుకుందని కానీ పోలీసుల వద్ద ఆధారాలు లేవు.
ఆమె మొబైల్ ఫోన్స్ డాటా అంతా రిట్రీవ్ చేసినా కానీ అలాంటి వివరాలేవీ దొరకలేదు. అయితే ఆమె ఆస్తులు మాత్రం అంతు చిక్కకుండా వున్నాయి. అన్నేసి కోట్ల ఆస్తులు కూడగట్టడానికి ఆమె సక్సెస్‍ఫుల్ హీరోయిన్ కూడా కాదు. స్టార్ హీరోయిన్ దగ్గర అన్ని కోట్లున్నాయంటే పోలీసులు పెద్దగా పట్టించుకోరు. కానీ సంజన వద్ద అన్ని కోట్లెలా వచ్చాయి? ఈ కోణంలోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే సుషాంత్ సింగ్ ఆస్తులు కాజేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి దగ్గర ఎలాంటి అనుమానిత ఆస్తులు, నగదు లభించలేదు. కానీ డ్రగ్స్ వాడుతుందని, సుషాంత్ కోసం ఆమె పలువురి వద్ద డ్రగ్స్ కొన్నదని ఆధారాలు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేసారు.
డ్రగ్స్ సిండికేట్‍లో భాగంగా అరెస్ట్ అయిన సంజన వద్ద డ్రగ్స్ సంబంధిత లింకులు దొరకలేదు కానీ ఆమె వద్ద వున్న ఆస్తులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రియా అరెస్ట్ తర్వాత డ్రగ్స్ తో లింక్ వున్న సెలబ్రిటీలంతా అలర్ట్ అయి తమ ఫోన్ డాటాని క్లియర్ చేసారనే రూమర్స్ వున్నాయి. సంజన కూడా అలాగే ముందే జాగ్రత్త పడి వుంటుందా అని కూడా అనుమానిస్తున్నారు.
This post was last modified on September 18, 2020 10:08 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…