Movie News

వాయువేగం తప్పించుకున్న పెద్ద గండం

ఎల్లుండి విడుదల కాబోతున్న భజే వాయు వేగం మీద హీరో కార్తికేయ ఆశలు అన్ని ఇన్ని కావు. యువి కాన్సెప్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మాణం కావడంతో రిలీజ్ పరంగా మంచి మద్దతు దక్కుతోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, గంగం గణేశాలు కవ్విస్తున్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు. అయితే సెన్సార్ కు ముందు ఈ సినిమా ఒక పెద్ద గండం నుంచి తప్పించుకోవడం అదృష్టమనే చెప్పాలి. షూటింగ్ అయ్యాక ఎడిటింగ్ చేసిన కాపీ ఉన్న హార్డ్ డిస్క్ లో తలెత్తిన సమస్య వల్ల టీమ్ కొన్ని నెలల పాటు తీవ్ర ఆందోళన చెంది దాని మీదే ఉండిపోయింది.

మధ్యలో హీరో కార్తికేయకు ఈ సంగతి తెలిస్తే ఎక్కడ టెన్షన్ పడతాడోనని ఆ విషయాన్ని దాచి పెట్టి ఎట్టకేలకు మరమత్తులు చేయించి దాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. ఎడిట్ అయిన కాపీకి ఇలాంటి సమస్య వస్తే చాలా పెద్ద రిస్క్. మళ్ళీ మొదటినుంచి కత్తెరకు పని చెప్పాల్సి ఉంటుంది. పైగా ముందు క్వాలిటీ మళ్ళీ రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చివరికి పరిష్కారం పట్టేశాడు. ఎవరికీ తెలియని ఈ సంగతి ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లో బయట పడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కోసారి పెద్ద బ్యానర్లలోనూ పొరపాట్లు జరుగుతాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ.

భజే వాయు వేగం మనీ క్రైమ్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ గా రూపొందింది. ఫస్ట్ హాఫ్ సరదాగా చిన్న చిన్న మలుపులతో సాగిపోయి సెకండ్ హాఫ్ మొబైల్ ఫోన్ చూసుకోలేనంత స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని దర్శకుడు హామీ ఇస్తున్నాడు. అదే నిజమైతే సరైన సినిమా రాక నెలన్నరగా ఆకలితో ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు మంచి ఆప్షన్ దొరికినట్టే. విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ సినిమాలకూ మంచి పాజిటివ్ వైబ్స్ ఉండటంతో ట్రేడ్ ఓపెనింగ్స్ మీద ఆశాభావంతో ఉంది. ఐపీఎల్ అయిపోయి జనాలందరూ ఎంటర్ టైన్మెంట్ కోసం థియేటర్లకు వస్తారనే భరోసాతో ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి .

This post was last modified on May 29, 2024 5:37 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

3 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

8 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

12 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

14 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

14 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

15 hours ago