Movie News

మణిరత్నం దారి పట్టిన గుణశేఖర్

దర్శకుడు గుణశేఖర్ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒక్కడు, చూడాలని ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ని బాలనటుడిగా పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ కూడా ఆయన ఖాతాలోనే ఉంది. అయితే వరస పరాజయాలు ఈ క్రియేటివ్ జీనియస్ ని వెనుకబడేలా చేశాయి.

రుద్రమదేవిని ఆపసోపాలు పడి తెరకెక్కిస్తే మంచి ఫలితమే దక్కింది కానీ బాహుబలి స్థాయిలో మేజిక్ చేయలేక పోయింది. వరుడు లాంటి డిజాస్టర్ ఇచ్చినా సరే కేవలం గుణశేఖర్ మీద నమ్మకంతో అల్లు అర్జున్ అందులో గోనగన్నారెడ్డిగా నటించి ఆ సినిమా విజయంలో అనుష్కతో పాటు తనవంతు పాత్ర పోషించాడు.

ఇక శాకుంతలం పెద్ద ట్రాజెడీ. విషాదం కూడిన ఇతిహాసాలను భారీ బడ్జెట్ తో తీయడం ఎప్పటికీ రిస్కేనని గుర్తించకపోవడం వల్ల అది మిగిల్చిన నష్టాలు అన్నీ ఇన్ని కావు. భాగస్వామిగా వచ్చి చేరిన దిల్ రాజు సైతం తీవ్రంగా ప్రభావితం చెందారు.

దీని దెబ్బకే ఎంతో ఇష్టపడి కష్టపడి రాసుకున్న హిరణ్యకసిపతో పాటు మరో పీరియాడిక్ డ్రామాని పక్కన పెట్టాల్సి వచ్చింది. రానాతో వేరే ప్రొడక్షన్ హౌస్ తీసే ప్లాన్ లో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే గుణశేఖర్ పూర్తిగా రూటు మార్చి ఇవాళ యుఫోరియా అనే కొత్త మూవీని ప్రకటించారు. నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు లేకుండా కేవలం టైటిల్ రివీల్ జరిగింది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో అందరూ కొత్తవాళ్లే ఉంటారట. యూత్ ఫుల్ కంటెంట్ ని తీసుకున్నారని వినికిడి. హఠాత్తుగా ఇలా రూటు మార్చుకోవడం వెనుక సహేతుకమైన కారణం కనిపిస్తోంది. గుణశేఖర్ ముందు తన కంబ్యాక్ ని బలంగా నిరూపించుకోవాలి. అది కూడా వీలైనంత తక్కువ బడ్జెట్ లో. లేనిపోని ఖర్చు చేసుకుంటూ పోతే బిజినెస్ టైంలో ఇబ్బందవుతుంది. మణిరత్నం సైతం ఇలాంటి బ్యాడ్ ఫేజ్ ని చూసి ఓకే బంగారం, పొన్నియిన్ సెల్వన్ తో ఎలా అయితే ఋజువు చేసుకున్నారో గుణశేఖర్ కూడా అదే తరహాలో పక్కా ప్రణాళికతో యుఫోరియాని ప్లాన్ చేసుకున్నారట. మంచిదే.

This post was last modified on May 28, 2024 4:33 pm

Share
Show comments
Published by
Satya
Tags: Gunasekhar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago