సరిగ్గా ఇంకో నెల రోజుల్లో జూన్ 27 విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించిన ప్రమోషన్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. కథలో కీలక పాత్ర పోషించిన బుజ్జి కారుతో బాగానే హడావిడి చేస్తున్నారు. కీర్తి సురేష్ తో డబ్బింగ్ చెప్పించడం ప్రత్యేకంగా నిలవగా నాగ చైతన్య లాంటి సెలబ్రిటీలను తీసుకొచ్చి స్వంతంగా డ్రైవింగ్ చేయించడం సోషల్ మీడియాలో బాగా వర్కౌట్ అవుతోంది. అయితే ఎంతసేపూ బుజ్జి గురించి తప్ప ఇప్పటికైతే మరో ప్రస్తావన తీసుకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇది అభిమానులకు నచ్చడం లేదు. ఏ దిల్ మాంగే మోర్ అంటూ డిమాండ్ చేస్తున్నారు.
మ్యాటర్ ఏంటంటే కల్కికి సంబంధించిన అసలైన కంటెంట్ ని ఇంకా ప్రమోషన్లలో వాడనే లేదని తెలిసింది. జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా సంయమనంతో ఉండాలని ముందే నిర్ణయించుకోవడంతో ఆ మేరకు కాస్త లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్లు దీపికా పదుకునే, దిశా పటాని పరిచయం జరగలేదు. అమితాబ్ బచ్చన్ ని మాత్రమే రివీల్ చేశారు. అనుపమ్ ఖేర్, పశుపతి లాంటి క్యాస్టింగ్ ని ఒక్కొక్కరిగా ఇంట్రో రూపంలో వదలబోతున్నారు. ఎక్కువ సమయం లేదు కాబట్టి చేతిలో ఉన్న టైంలోనే ఒకపక్క బిజినెస్ చూసుకుంటూ మరోపక్క ఇవి చక్కదిద్దుతున్నారు.
అసలైన ట్విస్ట్ మరొకటి ఉంది. న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ లు కీలక క్యామియోలు చేశారనే టాక్ ఆల్రెడీ ఉంది. అయితే ముందు దీన్ని సస్పెన్స్ గా ఉంచుదామనుకున్నారు కానీ లీకయ్యింది కాబట్టి ముందే చెప్పాలా వద్దానే నిర్ణయం తీసుకోలేదట. పారితోషికాలు కలిపి మొత్తం కల్కి 2898 ఏడి నిర్మాణానికి ఆరు వందల కోట్ల దాక ఖర్చు పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. సంతోష్ నారాయణన్ ఒక్క పాట మాత్రమే స్వరపిరిచి అసలైన పనితనాన్ని బీజీఎమ్ లో చూపించబోతున్నట్టు తెలిసింది. ఆడియో లాంచ్ జూన్ మొదటివారంలోనే జరగనుంది.
This post was last modified on May 28, 2024 4:28 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…