Movie News

పుష్ప విలన్‌కు అరుదైన వ్యాధి


‘పుష్ప’ మూవీలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రతో తెలుగువారికి ఎంతగానో దగ్గరయ్యాడు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. ఆ చిత్రంలో అతను కనిపించింది 20 నిమిషాలే అయినా.. తను వేసిన ఇంపాక్ట్ మాత్రం బలమైంది. అంతకంటే ముందే ఫాహద్ ‘బెంగళూరు డేస్’ సహా పలు మలయాళ చిత్రాలతో పాపులారిటీ సంపాదించినప్పటికీ.. ‘పుష్ప’తో మన వాళ్లలో వచ్చిన గుర్తింపే వేరు. ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తున్న ఫాహద్ గురించి ఇప్పుడో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించాడు.

తాను ఏడీహెచ్‌డీ అనే అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు ఫాహద్ చెప్పాడు. ఏడీహెచ్‌డీ అంటే.. అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ అట. ఇది మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుందట. 41 ఏళ్ల వయసులో తాను ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు ఫాహద్ వెల్లడించాడు.

మామూలుగా ఏడీహెచ్‌డీ అనే సమస్య చిన్న పిల్లల్లో కనిపిస్తుందట. దీని వల్ల దేని మీద ఎక్కువ సేపు శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్నిసార్లు అతి ప్రవర్తన.. తొందరగా ఆవేశపడడం లాంటి సమస్యలు తలెత్తుతాయట. ఇలాంటి లక్షణాలను గుర్తించి తాను వైద్యుడిని సంప్రదిస్తే తన సమస్య బయటపడినట్లు ఫాహద్ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ఫాహద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి ఎలాంటి చికిత్స అవసరం అనే విషయమై వైద్యులతో మాట్లాడుతున్నట్ల ఫాహద్ చెప్పాడు.

ఒక వ్యక్తికి ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందో చెప్పడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ లేవు. దీనిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రుగ్మతతో బాధ పడే పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు సవాల్. నియంత్రణకు థెరపీ, కొన్ని మందులు అవసరం అవుతాయి.

This post was last modified on May 28, 2024 1:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మోడీ వ‌ర్సెస్ బాబు’.. ఇక, ఈ చ‌ర్చ‌కు ఫుల్‌స్టాప్‌.. !

కొన్ని రాజ‌కీయ చ‌ర్చ‌లు ఆస‌క్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయ‌కులు కూడా.. సుదీర్ఘ‌కాలం చ‌ర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజ‌కీయ చ‌ర్చ‌ల్లో…

2 hours ago

చంద్ర‌బాబు ‘పీ-4’ కోసం ప‌ని చేస్తారా? అయితే రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌పిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుక‌దా! పేద‌ల‌ను ధ‌నికులుగా చేయాలన్నది ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం.…

5 hours ago

పూజా హెగ్డే… ఇంకెన్నాళ్లీ బ్యాడ్ లక్!

పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…

5 hours ago

షాకింగ్ అప్డేట్ ఇచ్చిన OG విలన్

అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…

5 hours ago

త‌మ్ముళ్ల‌లో మార్పు.. చంద్ర‌బాబు చేతిలో చిట్టా…!

కూట‌మిలో ప్ర‌ధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాల‌న‌ప‌రంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల ప‌రంగా దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి…

6 hours ago

జ‌గ‌న్ ఆశ‌లు ఫ‌ట్‌… ‘బ‌ల‌’మైన సంకేతం.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాకిచ్చే ప‌రిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌ల కూట‌మిని ఆయ‌న ఎంత తేలిక‌గా తీసుకుంటున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ…

6 hours ago