ఇప్పటిదాకా సినిమాలో విశేషాల గురించి టీంలో ఎవ్వరూ పెద్దగా మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు దర్శకుడు సుజీతే స్వయంగా కొన్ని విశేషాలు పంచుకున్నాడు. ‘భజే వాయు వేగం’ హీరో కార్తికేయ, దర్శకుడు శ్రీకాంత్‌లతో కలిసి ఒక చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న సుజీత్ ‘ఓజీ’ గురించి మాట్లాడాడు.
ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. ‘ఓజీ’ అనేది ‘ఓజాస్ గంభీర’ అనే రెండు పేర్లకు షార్ట్ నేమ్ అని సుజీత్ తెలిపాడు. ఇందులో ఓజాస్ అనేది సినిమాలో హీరో గురువు పేరు అని, గంభీర అనేది హీరో పేరని వెల్లడించాడు. ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఉంటుందని చెప్పిన సుజీత్.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే సీన్స్ హైలైట్ అన్నాడు. సినిమాలో ఐకిడో అనే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాల గురించి పవన్‌కు చెబితే చాలా ఎగ్జైట్ అయినట్లు సుజీత్ తెలిపాడు.
వెంటనే ముంబయి, పుణెల నుంచి ఇద్దరు మాస్టర్లను పిలిపించుకుని ప్రాక్టీస్ కూడా చేశారని.. దీంతో సగం రోజులో చిత్రీకరించాల్సిన సీన్లకు మూడు రోజులు పట్టిందని.. పవన్‌కు ఏదైనా నచ్చితే, ఆయన్ని ఎగ్జైట్ చేస్తే ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారని.. సన్నివేశం కోసం ఏమైనా చేస్తారనడానికి ఇది ఉదాహరణ అని సుజీత్ తెలిపాడు.
This post was last modified on May 28, 2024 8:33 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…