జూలైలో విడుదల కాబోయే భారతీయుడు 2లో అందరూ కమల్ హాసన్ విశ్వరూపం గురించి ఆలోచిస్తున్నారు కానీ కథాపరంగా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రను సిద్దార్థ్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ లీక్. దాని ప్రకారం సేనాపతి విదేశాల్లో ఉన్నప్పుడు ఇండియాలో అవినీతి రాజకీయాల పట్ల పోరాటం చేస్తున్న యువకుడి గురించి తెలుస్తుంది. తనని ఒంటరివాడికి చేసి లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రాణాలు కూడా పోవచ్చని గుర్తించి అతన్ని రక్షించడానికే వయసు మళ్ళిన సేనాపతి భారతదేశంలో అడుగు పెట్టడంతో సినిమా మొదలవుతుందని అంటున్నారు. పాయింట్ బాగుంది కదూ.
ఇక్కడికి వచ్చాక సేనాపతికి ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు రజనీకాంత్ శివాజీ తరహాలో వ్యవస్థలో డొల్లతనాన్ని చూపిస్తూనే అతను వేసే శిక్షలను ఈసారి మరింత ప్రత్యేకంగా డిజైన్ చేశాడట దర్శకుడు శంకర్. సిద్దార్థ్ ప్రియురాలిగా రకుల్ ప్రీత్ సింగ్ చేసింది. ఈ ఇద్దరి మధ్య డ్యూయెట్ నే సెకండ్ ఆడియో సింగల్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఒక పాట తప్ప ఇంకే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయని భారతీయుడు 2 బృందం జూన్ 1 చెన్నైలో నిర్వహించబోయే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి శ్రీకారం చుట్టనుంది. చిరంజీవి, చరణ్ గెస్టులుగా వస్తారనే ప్రచారం ఉంది.
తమిళంలో బాగానే ఆఫర్లు వస్తున్నా తెలుగులో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సిద్దార్థ్ కు భారతీయుడు 2 ఆ కోరిక తీరుస్తుందేమో చూడాలి. మూడో భాగం కూడా ఉంది కాబట్టి అందులో కూడా ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. మొదటిసారి లోకనాయకుడితో కలిసి నటించడం పట్ల తను ఎగ్జైట్ అవుతున్నాడు. కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న భారతీయుడు 2 రిలీజ్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇది థియేటర్లలో అడుగు పెడితే తప్ప గేమ్ ఛేంజర్ మీద శంకర్ పూర్తి ఫోకస్ పెట్టడని అర్థమైపోయింది.
This post was last modified on May 27, 2024 9:15 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…