ఎంత స్టార్లయినా సరే కొన్నిసార్లు వాళ్ళ మధ్య వచ్చే విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయంటే దశాబ్దాల తరబడి గ్యాప్ వచ్చేస్తుంది. పైకి ప్రేక్షకులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కెరీర్లను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటిదే ఇది. సూపర్ స్టార్ రజినీకాంత్, బాహుబలి కట్టప్పగా మనకూ బాగా సుపరిచితమైన సత్యరాజ్ కు గత 38 సంవత్సరాల్లో ఎప్పుడూ కలిసి నటించలేదంటే వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఇన్నేళ్ల తర్వాత ఈ కలయికను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సాధ్యం చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అంతగా ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.
ముప్పై ఏళ్ళ క్రితం 1994లో రజినీకాంత్ వీరా రిలీజై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో సత్యరాజ్ సుకన్య జంటగా నటించిన ఓ మూవీ రిలీజ్ కి సిద్ధమయ్యింది. రెండు హిట్టయ్యాయి. అయితే బిజినెస్ సమయంలో తన పట్ల వివక్షతో డిస్ట్రిబ్యూటర్లు తక్కువ మొత్తం ఆఫర్ చేశారనే కోపం సత్యరాజ్ కు ఉండేది. తన సినిమా విజయోత్సవాన్ని ఒక చారిత్రక ప్రదేశంలో నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదే చోట రజని సక్సెస్ మీట్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో కర్ణాటక నుంచి వచ్చిన బయటివాడిని తమిళ సర్కారు నెత్తినబెట్టుకుందని విమర్శలు చేశారు.
కట్ చేస్తే 2006 శివాజీలో సుమన్ పోషించిన విలన్ పాత్రకు రెట్టింపు రెమ్యునరేషన్ తో ముందు సత్యరాజ్ కే ఆఫర్ చేశారు. రజని సైతం ఓకే అన్నారు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సత్యరాజ్ ససేమిరా అన్నారు. అప్పటికి ఆగ్రహం చల్లారలేదు. రజినీకాంత్ సిఎంగా చూడటం కన్నా ఘోరం మరొకటి ఉండదని అయన అన్నట్టు మీడియా కథనాలున్నాయి. అలా ఈ కాంబో కోసం ఎందరు ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరిసారి ఇద్దరు బాలచందర్ దర్శకత్వంలో 1987 మనతిల్ ఉరుది వేండుం (తెలుగులో సిస్టర్ నందిని) లో కలిసి అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు కూలిలో స్నేహితులగా నటిస్తారని టాక్.
This post was last modified on May 27, 2024 3:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…