నెల రోజుల ముందు రావాల్సిన ‘లవ్ మి’ మూవీని ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల నుంచి స్లంప్‌లో సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ కళ తేగల సినిమాగా దీన్ని విశ్లేషకులు భావించారు. ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే కనిపించిన రిలీజ్ రోజు సినిమాకు మంచి బజ్‌యే కనిపించింది. మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో కూడా ఈ సినిమాకు బాగానే జనం కనిపించారు.
తొలి రోజు ఈ జనాన్ని చూసి టాలీవుడ్ అంతా కూడా చాలా సంతోషించింది. ‘లవ్ మి’కి ఓపెనింగ్స్ అంచనాలకు మించే వచ్చాయి. కానీ సినిమాకు టాక్ మాత్రం సరిగా లేకపోవడం మైనస్ అయింది. దీనికి తోడు ఆదివారం రోజు ఐపీఎల్ ఫైనల్ ఉండడంతో యూత్ అంతా ఆ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఆ ప్రభావం ‘లవ్ మి’ మీద గట్టిగానే పడింది.
కొంచెం క్రేజ్ ఉన్న కొత్త సినిమాలకు టాక్‌తో సంబంధం లేకుండా శని, ఆదివారాల్లో మంచి ఆక్యుపెన్సీలు వస్తుంటాయి. కానీ ‘లవ్ మి’ శనివారం బాగానే ఆడి.. ఆదివారానికి డల్ అయిపోయింది. కళకళలాడాల్సిన ఈవెనింగ్, నైట్ షోలు ఐపీఎల్ ఫైనల్ వల్ల జనం లేక వెలవెలబోయాయి. అసలే టాక్ బాలేదు, పైగా ఐపీఎల్ ఫైనల్.. ఇక సినిమాకు ఎందుకు వెళ్తారు యూత్. ఈ చిత్రాన్ని శనివారం రిలీజ్ చేయడం రాంగ్ డెసిషన్ అనడంలో సందేహం లేదు.
శుక్రవారం రిలీజై ఉంటే.. తొలి రోజు ఎలాగూ ఓపెనింగ్స్ ఉంటాయి. శనివారం కూడా మంచి వసూళ్లు సాధించేది. ఆదివారం ఎలా ఉన్నా కొంత మేర సినిమా సేఫ్ అయ్యేది. ఇప్పుడు కేవలం ఒక్క రోజు వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. టాక్ బాలేదు కాబట్టి సోమవారం నుంచి ఎలాగూ వసూళ్ల మీద ఆశలు ఉండవు. మొత్తంగా చూస్తే నెల రోజులు వాయిదా వేసుకున్నా చివరికి సరైన ప్లానింగ్ లేకుండా సినిమాను రిలీజ్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది ‘లవ్ మి’ టీం.
This post was last modified on May 27, 2024 3:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…