మాస్ మహారాజా రవితేజ లాస్ట్ బ్లాక్ బస్టర్ ఏదంటే గుర్తొచ్చేది ధమాకానే. రిలీజైన రెండు మూడు రోజులు టాక్ కొంచెం అటుఇటుగా వచ్చినా ఫైనల్ గా భారీ వసూళ్లతో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా శ్రీలీల గ్లామర్, డాన్సులు ఈ సినిమా సక్సెస్ లో ఎంత కీలక పాత్ర పోషించాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. సీనియర్ హీరోతో జోడి కంటికి ఆనుతుందా లేదానే అనుమానాలకు చెక్ పెడుతూ ఇద్దరూ చెలరేగిపోయిన తీరు మాస్ ని కట్టిపడేసింది. విచిత్రంగా ఆ తర్వాత రవితేజ, శ్రీలీల జంట విడివిడిగా చేసిన సినిమాలు కలిసి రాలేదు. కాకతాళీయమే అయినా ప్రత్యేకంగా అనిపిస్తుంది.
అందుకేనేమో ఈ పెయిర్ మరోసారి కనువిందు చేసేందుకు రెడీ అవుతోంది. సామజవరగమన రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే వినోదాత్మక చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా ఓకే అనుకున్నట్టు తెలిసింది. 2025 సంక్రాంతి విడుదలని ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ టైంలో ప్రకటించేశారు. దీంతో వీలైనంత త్వరగా షూటింగ్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఫ్యాన్స్ కి ఈ కలయిక పండగే.
భగవంత్ కేసరిని మినహాయించి గుంటూరు కారంతో సహా శ్రీలీలకు ఆశించిన స్థాయిలో పెద్ద బ్రేక్ దక్కలేదు. అందుకే ఎంబిబిఎస్ పరీక్షల కోసం గ్యాప్ తీసుకుని ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఎదురు చూస్తోంది. ఈలోగా భాను చెప్పిన స్టోరీ బాగా నచ్చి ఒప్పేసుకుందని వినికిడి. ఇక రవితేజలో కామెడీ యాంగిల్ ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించేలా భాను స్క్రిప్ట్ సిద్ధం చేశాడని తెలిసింది. సరైన హిట్ చూసి మాస్ మహారాజాకు నెలలు గడిచిపోయాయి. ఈగల్ సైతం నిరాశపరిచింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మిస్టర్ బచ్చన్ చివరి దశకు చేరుకుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తారు
This post was last modified on May 27, 2024 1:17 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…